ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిండర్ వైఎస్ జగన్ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా యువభేరీలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. స్వలాభం కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.