‘నాకు అనుభవం ఉంది. రుణమాఫీపై పూర్తి అధ్యయనం చేశాను. అందుకే హామీలు ఇస్తున్నా...’ అని ఎన్నికల సందర్భంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు ఆ అనుభవాన్ని ఉపయోగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలపై ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం తీరును వారు ఖండిస్తున్నారు. నిబంధనలతో కూడిన మాఫీలు వద్దని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం పూర్తి రుణమాఫీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అనైక్యత వల్లనే...
రాష్ర్టంలో రైతుల అనైక్యత కారణంగానే చంద్రబాబు నాయుడు నెట్టుకువ స్తున్నారు. మిగిలి ఉన్న నాలుగేళ్ల పదవీ కాలాన్ని ఇలాగే మోసపూరితంగా గడిపేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీని యదాతథంగా అమలు చేయకుండా వడపోస్తూ, అర్హులను తగ్గించుకుంటూ పోతోంది. ఇది సరి కాదు. వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయాల్సిందే. ఇప్పటికే జనంలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
- గేదెల సత్యనారాయణ, ఏపీ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు, సాలూరు
జగన్ పిలుపుతోనే కదలిక
రైతులు, మహిళల అవస్థలను గుర్తించి వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మహాధర్నాకు పిలుపునివ్వడంతోనే రాష్ర్ట ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి చేసిన రుణమాఫీ విధాన ప్రకటన మోసపూరితంగా ఉంది. వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని నమ్మించి, నేడు పంటరుణాలనే మాఫీ చేస్తానని హామీ ఇచ్చానని చెప్పుకుంటున్నారు. రుణమాఫీ అర్హుల బ్యాంక్ అకౌంట్లు కోటికి పైగా ఉండగా, వాటిని 83 లక్షలకు తగ్గించి దగా చేస్తున్నారు. దానికీ సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. అడుగడుగునా దగా, మోసం స్పష్టంగా కనిపిస్తోంది.
- పీడిక రాజన్నదొర, వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే, సాలూరు
బాబును నమ్మి మోసపోయాం
ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను పూర్తి మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా డ్వాక్రా రుణాల మాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బాబును నమ్మి మోసపోయాం.
- పూడి జయలక్ష్మి,
డ్వాక్రాసంఘ ఆర్గనైజర్,వాడాడ, బాడంగి మండలం
మోసపూరిత విధానాలకు నిదర్శనం
రైతు రుణమాఫీపై చంద్రబాబు చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీ మోసపూరిత వైఖరిని తెలియజేస్తోంది. ఎన్నికల్లో రు ణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు డొంకతిరుగుడు విధానాన్ని అనుసరించడం పద్ధ తి కాదు. రబీ సీజన్‌లో కూడా పంట రుణాలు లభించక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. రుణ మాఫీని పూర్తిగా అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలి.
- ఎన్‌వై నాయుడు,
సీపీఎం పట్టణ కార్యదర్శి, సాలూరు
హామీలు అమలు చేయాలి
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. చేయలేను అంటే కుదరదు. చంద్రబాబు మాయ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయాలి.
- ఎం.కృష్ణమూర్తి, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి
మోసం చేశారు...
ఎన్నికల ముందు రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు రూ.50వేల లోపు రుణాలే మాఫీ చేస్తానని చెప్పడం దారుణం. రూ.50వేల కంటే ఎక్కువుంటే ఐదు దఫాలుగా చెల్లిస్తానని, అది కూడా కుటుంబానికి మొత్తం పరమితి విధించడం సరి కాదు. రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా రైతులను మోసం చేసింది.
- పెద్దిమటి రామారావు,
వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు, బాడంగి
అధికారం కోసమే...
చంద్రబాబు అధికారం కోసం అవగాహన లేని ప్రకటనలు చేశారు. ఇది రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రైతు, డ్వాక్రా సంఘాలకు పూర్తిగా రుణమాఫీ చేయాలి
- భీశెట్టి బాబ్జి, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్
ధర్నా ఉంది కాబట్టే...
రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేయాలని 5న జగన్ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి చంద్రబాబు ఆదరాబాదరాగా కొంత రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి అధ్యయనం చేసే హామీలు ఇస్తున్నానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాలి. పక్కనున్న కొత్త ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ అమలు చేస్తే సీనియర్‌గా చెప్పుకునే చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రుణాలను మాఫీ చేయాలి. లేదంటే రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదు.
- మర్రాపు సూర్యనారాయణ,
రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఇలాంటి రుణమాఫీ ఎక్కడా వినలేదు
రైతు రుణమాఫీ అంటే రై తులకు ఉన్న రుణాలు మొత్తం మాఫీ జరగాలి. ఇలా విడతల వారీగా జరగడం ఇదే ప్రథ మం. మొత్తం మాఫీ చేస్తామ ని, ఇలా విడతల వారీగా, జాబితాల వారీగా ఇవ్వడం దారుణం. రైతులందరికీ రుణమాఫీ జరగాలి. ఆంక్షలు లేని మాఫీ జరగాలి. అప్పుడే చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది.
- కోరాడ నారాయణరావు,
పీఏసీఎస్ అధ్యక్షుడు, పెదనడిపల్లి
ఇంటిలో డబ్బులు తీయండి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబా బు నాయుడు అమలుచేయాలి. ఇంటిలో డ బ్బు తీసైనా రుణమాఫీ చేయాలి. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేశారు, రైతులకు ఇవ్వడానికి ఏమైంది. ఆంక్షలు లేని రుణమాఫీ చెయ్యాలి. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రుణమాఫీ జరగాలి. లేదంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
- రెడ్డి లక్షుంనాయుడు,
లోక్‌సత్తా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి,
చీపురుపల్లి
మాట తప్పిన చంద్రబాబు
ఎన్నికల ముందు రైతుల కు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోందని, కంటి తుడుపు చర్య కింద రూ.50 వేలు ఇవ్వడం దారుణం. అది కూడా తొలి జాబితాలో ఉన్న వారికి ఇవ్వడమేంటి. రైతులందరికీ ఇవ్వాలి. మొత్తం రుణమాఫీ జరిగేంత వరకు పోరాటం చేస్తాం.
- వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, చీపురుపల్లి
ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలి...
‘నేను తప్పు చేశాను. ఎన్నికల్లో అబద్దమాడాను. నేను ఎన్నికల్లో ఇచ్చి న హామీలను అమలు చేయలేకపోతున్నాను’ అని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి మోసా లు, దగా లు భవిష్యత్‌లో చేయకూడదు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి ఎన్నికల మేనిఫెస్టోను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని వారి ఎన్నికను రద్దు చేయాలి.
- పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి
‘మాఫీ’ మాయ ఇంకెన్నాళ్లు..?
Published Fri, Dec 5 2014 1:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement