
సర్కార్‌పై ధర్నాగ్రహం
సర్కారు మాఫీ మాయలపై సమరానికి సర్వం సిద్ధమైంది. చంద్రబాబు మాటల గారడీ రంగు తేల్చడానికి వైఎస్‌ఆర్ సీపీ నడుం బిగించింది.
విజయనగరం కంటోన్మెంట్ : సర్కారు మాఫీ మాయలపై సమరానికి సర్వం సిద్ధమైంది. చంద్రబాబు మాటల గారడీ రంగు తేల్చడానికి వైఎస్‌ఆర్ సీపీ నడుం బిగించింది. మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని ముళ్లకర్రతో తట్టిలేపేందుకు, రైతన్నలకు అండగా నిలిచేందుకు ఎందాకైనా వెళతామని హెచ్చరించింది. ఎన్నికలకు ముందు ఓ మాట తర్వాత మరో మాటను పలుకుతున్న ముఖ్యమంత్రి తీరును నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్‌ఆర్ సీపీ పిలుపునిచ్చింది. పూర్తిగా రుణమాఫీ బాబు సర్కార్‌పై ధర్నాగ్రహం !చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు శుక్రవార కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
ధర్నాకు ఏర్పాట్లు పూర్తి
రుణమాఫీని అటకెక్కించిన తెలుగుదేశం ప్రభుత్వం తీరును ఎండగడుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ మహా ధర్నా కు కార్యకర్తలు, నాయకులతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు కూడా హాజరుకానుండడంతో అదే స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ధర్నాకు పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా తటస్థంగా ఉండే ప్రజలు కూడా హాజ రవుతున్నారు. కలెక్టరేట్ వద్ద ఐదు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ధర్నాను ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా చేపట్టి విజయవంతం చేసేందుకు వైఎస్‌ఆర్ సీపీ నా యకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గంట్యాడ రూట్‌లో కొన్ని నియోజకవర్గాలు, బొబ్బిలి వైపు మరికొన్ని నియోజకవర్గాలు, ఆర్‌అండ్‌బీ బంగ్లా వైపు కొన్ని మండలాలు, కంటోన్మెంట్ గూడ్స్ షెడ్ వైపు మరికొన్ని మండలాల ప్రజలు వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్నా సమయం ఆసన్నమవగానే అన్ని మండలాలు, నియోజకవర్గాల ప్రజలంతా క్రమశిక్షణతో ఒకేసారి వచ్చి చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ధర్నాకు అన్నివర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఒక ప్రకటనలో కోరారు.
వాహనాలను అడ్డుకోవాలని ఆదేశాలు
వైఎస్‌ఆర్ సీపీ నిర్వహిస్తున్న మహాధర్నాకు రైతులు,ప్రజలు వచ్చే వాహనాలను అడ్డుకోవాలని పోలీసులకు లోపాయికారీగా ఆదేశాలు అందినట్టు తెలిసింది. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్న నెపంతో ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుని ప్రజలు ధర్నాకు వెళ్లకుండా నిరోధించాలన్న ప్రణాళికతో ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.
ధర్నా ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ
విజయనగరం క్రైం : కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ధర్నా ప్రాంతాన్ని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవావెల్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న రెండు గేట్లును పరిశీలించారు. ధర్నాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయనతో పాటు విజయన గరం డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, సీఐలు ఉన్నారు.