
రైతు మహాధర్నాకు తరలిన నాయకులు
రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించక పోవడానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కడపలో నిర్వహించిన మహాధర్నాకు శనివారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టరు వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో సుమారు 200 వాహనాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.
బద్వేలు(అట్లూరు): రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించక పోవడానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కడపలో నిర్వహించిన మహాధర్నాకు శనివారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టరు వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో సుమారు 200 వాహనాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఉదయాన్నే కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల, బి.కోడూరు, గోపవరం, బద్వేలు మండలాల నాయకులు ఒక్కో మండలానికి సుమారు 30 వాహనాలలో ఆయా మండల నాయకులు ఆధ్వర్యంలో బద్వేలుకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ సమన్వయ కర్త వైఎస్సార్ సీపీ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా మహా ధర్నాకు పనులను వదులుకుని వచ్చారు. కార్యాక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి శింగమల వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టరు మునెయ్య, వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శులు అందూరి రామకృష్ణారెడ్డి, కొండు శేఖర్‌రెడ్డి, పోరుమామిళ్ల మండలాధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, బి. కోడూరు జెడ్పీటీసీ సభ్యుడు చౌదరి రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుదర్శన్, శారదమ్మ, కాశినాయన, బ్రాహ్మణపల్లి, చిన్నకేశంపల్లి సింగిల్‌విండో అధ్యక్షులు రామిరెడ్డి, గుర్రంపాటి సుందరరామిరెడ్డి, వంకెల పోలిరెడ్డి, నాయకులు బిజి వేముల రామసుబ్బారెడ్డి, అంభవరం వెంకటేశ్వరరెడ్డి, శింగసాని గురుమోహన్, గోపాలస్వామి, అట్లూరు సర్పంచుల సంఘం అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, వేమలూరు సర్పంచు ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.