
ధర్నా చేస్తున్న వితంతువు
అన్నానగర్: కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం వితంతువు ఆందోళన చేపట్టింది. కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ఆవిన్ పాల పార్లర్ ఎదుట సోమవారం సాయంత్రం ఓ మహిళ ఏడుస్తూ కనిపించింది. ఆమెను ప్రశ్నించగా తాను వితంతువునని అధికారిక అనుమతి పొంది ఇక్కడ ఆవిన్ పార్లర్ నిర్వహిస్తున్నానని తెలిపింది. సోమవారం పబ్లిక్ వర్క్స్ అధికారులమంటూ కొందరు వచ్చి తన పార్లర్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, దుకాణం మూసేశారని, పార్లర్‌ను మరొకరికి ఇవ్వడానికే ఖాళీ చేయ మంటున్నారని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment