
అనూజకు మూడుముళ్లు వేసి బొట్టు పెడుతున్న సీఆర్‌పీఎఫ్ ప్రమోద్
ప్రమోద్, అనూజా ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రమోద్ సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు.
కృష్ణరాజపురం: తనకు న్యాయం చేయాలని ఓ యువతి బుధవారం రాత్రి పోలీసుస్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగిన ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హొసకోటె తాలూకాలోని నందగుడిలో చోటు చేసుకుంది. వివరాలు... స్థానికంగా ఉంటున్న ప్రమోద్, అనూజా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రమోద్ సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు.
దీంతో గతనెల 19న వీరు యలహంక సమీపంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఆమెతో ఉన్న ప్రమోద్ ఆ తరువాత కనిపించలేదు. ఫోన్ కూడా స్విచాఫ్ అయ్యింది. ప్రమోద్ మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధితురాలు నందగుడి పోలీసు స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి : (భర్త హత్య.. నౌసిన్‌కు సహకరించింది అతడే!)
పెళ్లయిన రెండు నెలలకే అనంతలోకాలకు.. )