వైఎస్సార్‌ విగ్రహ పునఃప్రతిష్ట కోసం ధర్నా.. | YSR Statue Foundation Committee Slams TDP Leaders | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 1 2019 3:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

నగరంలోని కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌​ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని వైఎస్సార్‌ విగ్రహ పునఃప్రతిష్ట కమిటీ ఆందోళన చేపట్టింది. కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ పేరుతో వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించారని కమిటీ సభ్యులు ఆరోపించారు. మహానేత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కోరుతూ శనివారం ఫైర్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి.. అక్కడున్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహాన్ని తొలగించారు కానీ ప్రజల మనసుల్లోనుంచి వైఎస్సార్‌ను తొలగించలేకపోయారని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement