మైనర్‌పై ఐదేళ్లుగా కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు.. తండ్రితో సహా.. | Young Girl Harassed By Her Father And Brother Past Five Years | Sakshi
Sakshi News home page

మైనర్‌పై ఐదేళ్లుగా కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు.. కన్న తండ్రి, తాత, అన్న..

Published Sat, Mar 19 2022 6:06 PM | Last Updated on Sat, Mar 19 2022 7:20 PM

Young Girl Harassed By Her Father And Brother Past Five Years - Sakshi

సాక్షి, ముంబై: దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వావివరుసలు మరచి చిన్నారులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కన్న కూతురిపైనే తండ్రి, ఇంటి సభ్యులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు(11) కుటుంబం బీహార్‌ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. సదరు మైనర్‌ తాను చదువుతున్న పాఠశాలలో జరిగిన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమంలో తన గోడును వెల్లడించింది. తాను ఐదేళ్లుగా కన్న తండ్రి, ఇంటి సభ్యులతో లైంగికంగా వేధించబడుతున్నట్టు తెలిపింది. 2017 నుంచి  తండ్రి లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా.. తండ్రి, సోదరుడు వేరు వేరు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 

2020లో ఆమె సోదరుడు బాధితురాలిపై లైంగిక దాడి చేయగా.. తాత, మామ కూడా మైనర్‌ను లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది సామూహిక లైంగిక దాడి కాదని, మైనర్‌పై లైంగిక దాడులన్నీ వేర్వేరు సందర్బాల్లో జరిగాయని ఎస్సై అశ్విని సాత్​పుతె పేర్కొన్నారు. ఈ క్రమంలో మైనర్‌ కుటుంబ సభ్యులపై  పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement