బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చూశారా! | Nandamuri Balakrishna Celebrated His Birthday With Family Members | Sakshi
Sakshi News home page

బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఫోటోలు వైరల్‌

Published Wed, Jun 10 2020 9:02 PM | Last Updated on Wed, Jun 10 2020 9:23 PM

Nandamuri Balakrishna Celebrated His Birthday With Family Members - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్‌డే వేడుకలు ఆయన స్వగృహంలో నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తన 60వ పుట్టినరోజు వేడుకలను అభిమానుల సమక్షంలో కాకుండా కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు బాలయ్య చేత కేక్‌ కట్‌ చేయించి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ వేడుకలో బాలకృష్ణ కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకు, మనవళ్లు స్పెషల్‌ డ్రెస్ కోడ్‌ను పాటించారు. ‘విన్టేజ్ ఎన్బీకే 1960’ థీమ్‌ గల నీలం రంగు టీషర్ట్స్ ధరించడం, బాలయ్య సూపర్‌హిట్‌ చిత్రాల్లోని పాత్రలతో రూపొందించిన బ్యానర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  (బాలయ్యకు షష్టిపూర్తి; చిరు ట్వీట్‌)

అంతకుముందు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. వారితో కాసేపు సరదాగా గడిపారు. ప్రస్తుతం బాలయ్య బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. (బాలయ్య బర్త్‌డే గిఫ్ట్‌: సాంగ్‌ విన్నారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/9

2
2/9

3
3/9

4
4/9

5
5/9

6
6/9

7
7/9

8
8/9

9
9/9

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement