basavatarakam Indo American Cancer haspatal
-
బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ చూశారా!
సాక్షి, హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్‌డే వేడుకలు ఆయన స్వగృహంలో నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన 60వ పుట్టినరోజు వేడుకలను అభిమానుల సమక్షంలో కాకుండా కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు బాలయ్య చేత కేక్ కట్ చేయించి బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ వేడుకలో బాలకృష్ణ కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకు, మనవళ్లు స్పెషల్ డ్రెస్ కోడ్‌ను పాటించారు. ‘విన్టేజ్ ఎన్బీకే 1960’ థీమ్ గల నీలం రంగు టీషర్ట్స్ ధరించడం, బాలయ్య సూపర్‌హిట్ చిత్రాల్లోని పాత్రలతో రూపొందించిన బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. (బాలయ్యకు షష్టిపూర్తి; చిరు ట్వీట్) అంతకుముందు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. వారితో కాసేపు సరదాగా గడిపారు. ప్రస్తుతం బాలయ్య బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (బాలయ్య బర్త్‌డే గిఫ్ట్: సాంగ్ విన్నారా?) -
బసవతారకం ఆస్పత్రి పైనుండి పడి మహిళ మృతి
టాయ్ లెట్ కోసం వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందిన ఘటన గురువారం బంజారా హిల్స్ పరిధిలోని బసవతారకం ఆస్పత్రిలో జరిగింది. ప్రమాదం వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ కు చెందిన ఖైరున్నీసా బేగం(60) బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో చేరిన కూతురు జకీరా సుల్తానాకు సాయంగా ఉంటోంది. గురువారం మధ్యాహ్నం ఆపరేషన్ కోసం కోసం జకీరా సుల్తానాను ఆస్పత్రి బ్లాక్-3లో ఉన్న ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. కూతురితోపాటు ఖైరున్నీసా కూడా ప్రీ ఆపరేటెడ్ వార్డు వరకు వెళ్లింది. కొద్దిసేపటికి ఆమె మూత్రవిసర్జన కోసం సమీపంలో ఉన్న టాయ్‌లెట్ అని రాసి ఉన్న గదిలోకి వెళ్లింది. తర్వాత అక్కడే ఉన్న మరో గది తలుపులు తెరిచి బయటకు రావడానికి అడుగు ముందుకేసింది. అయితే ఆ గది బయటకు వెళ్లడానికి ఏర్పాటు చేసినది కాదని డ్రెయినేజీ పైప్లైన్లు, కరెంటు వైర్లు బాగుచేయడానికి ఏర్పాటు చేసిన అత్యవసర ద్వారమని ఆమెకు తెలియకపోవడంతో అక్కడి నుంచి కిందపడి మృతి చెందింది. ఖైరున్నీసా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మీడియాను ఘటనాస్థలానికి అనుమతించలేదు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.