నాగార్జునసాగర్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ను సందర్శించారు. తెలంగాణ లాంచీలో హిల్ కాలనీ నుంచి కొండకు వెళ్లారు. అక్కడ అలనాటి నదీలోయ నాగరికతను ప్రతిబింబించే దృశ్యాలు, రాతియుగం, శిలాయుగంలో వాడిన పనిముట్లు గల మ్యూ జియం, గ్యాలరీని తిలకించారు. బుద్ధుడికి సంబం ధించిన విగ్రహాలు, చైత్యాలు, యజ్ఞశాల, ఓడరేవు తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా జడ్జీలు తిరుమలరావు, ప్రభాకర్, గురజాల, మాచర్ల జడ్జిలు సత్యశ్రీ , అజయ్‌కుమార్, నిడమనూరు జడ్జి రాధాకృష్ణ, ఎస్పీ రంగనాథ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment