న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి కిరాతక ఘటనకు పాల్పడ్డాడు. తన తాత, అవ్వ, మామలను ఒకేసారి తుపాకీతో కాల్చి హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఓం బ్రహ్మభట్ (23) అనే యువకుడు దిలీప్‌కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72), యశ్‌కుమార్ బ్రహ్మభట్ (38)లను కాల్చి చంపాడు. గుజరాత్ నుంచి వలస వచ్చిన నిందితుడు బంధువులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బంధువులతో అతనికి వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన బ్రహ్మభట్.. వారిని తుపాకీతో కాల్చాడు. దీంతో బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే నిందితుడు ఉన్నాడని పోలీసులు చెప్పారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడని వెల్లడించారు.
ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
Comments
Please login to add a commentAdd a comment