సాక్షి, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామిని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆదివారం దర్శించుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఈవో సాగర్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి అమర్‌నాథ్.. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆయనను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. మంత్రిని కలంకారి వస్త్రంతో సత్కరించి వినాయక ప్రతిమను బహుకరించారు.
చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న..
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్న భూమినే ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అక్రమ మార్గంలో సాగే వారిని, సక్రమమైన మార్గంలో నడిచే వారు కాదని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు చేపట్టిందన్నారు. ఆక్రమణలు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి అన్నారు.
శ్రీకాళహస్తి సమీపంలోని ఐనగలూరు రూ.700 కోట్లు పదివేల మందికి ఉపాధి కల్పించే విధంగా అపాచీ పరిశ్రమకు ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. అలాగే తిరుపతిలో ఐఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపన ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏపీని అగ్రగామి తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment