ముక్కంటి చెంత ఎన్టీఆర్ కుమార్తెలు | NTR Daughters performs pooja in srikalahasthi | Sakshi
Sakshi News home page

ముక్కంటి చెంత ఎన్టీఆర్ కుమార్తెలు

Published Sat, Jan 17 2015 8:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

ముక్కంటి చెంత ఎన్టీఆర్ కుమార్తెలు

ముక్కంటి చెంత ఎన్టీఆర్ కుమార్తెలు

శ్రీకాళహస్తి:  శ్రీకాళహస్తి దేవస్థానానికి శుక్రవారం దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తెలు దారపాటి లోకేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి, బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర, నారా ఇందిర విచ్చేశారు. వారికి ఆలయ ఈవో రామిరెడ్డి స్వాగతం పలికారు. రూ.2,500 టికెట్ ద్వారా ప్రత్యేక రాహుకేతు పూజలు చేసుకున్నారు.

 

తర్వాత స్వామి,అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు.అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. వారికి స్వామి,అమ్మవార్ల చిత్ర పటాన్ని,తీర్థప్రసాదాలను ఈవో అందజేశారు. వారితోపాటు ఆలయ పీఆర్వో హరిబాబు యాదవ్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement