
సాక్షి, శ్రీకాళహస్తి: ఏపీలోని శ్రీకాళహస్తిలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభ జరుగుతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. కాగా, సభలో నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.
మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ విధానం. ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తొమ్మిదేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించంది. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోంది. పేదల పక్షపాతిగా మోదీ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి అజెండాగానే బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సాగింది. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు మౌళిక సదుపాయాలు కల్పించాం. వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: వాడకమంటే బాబుదే.. సీనియర్ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా?
Comments
Please login to add a commentAdd a comment