శ్రీదేవి (ఫైల్)
సాక్షి, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పండితుడు ములుగు రామలింగేశ్వరస్వామి ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేశారు. ప్రముఖ నటి శ్రీదేవిది హత్యేనని, సన్నిహితులే శ్రీదేవిని చంపారని ఆదివారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని పేర్కొన్నారు.
ఆలయంలో ఉగాది సందర్భంగా భక్తుడైన కన్నప్పకు శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున సారె అందజేశారు. ఆనవాయితీగా కైలాసగిరి కొండపై వెలసి ఉన్న భక్తకన్నప్ప ఆలయానికి మేళతాళాల నడుమ సంప్రదాయబద్ధంగా వెళ్లి సారెను అందజేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణలు జరిగాయి. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కూడా సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ నెలకొంది. విద్యుద్దీపాలు, పుష్ప, మామిడి తోరణాలు, అరటి చెట్లతో ఆలయం కొత్తశోభను సంతరించుకుంది. ఈఓ భ్రమరాంబ, ఏఈఓ శ్రీనివాసులురెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment