
సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా వైరస్ అదుపులో ఉందని కోవిడ్ ప్రత్యేకాధికారి సిసోడియా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదు రోజులుగా శ్రీకాళహస్తిలో కొత్త కరోనా కేసులు నమోదు కాలేదన్నారు. శ్రీకాళహస్తిపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. అక్కడ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించిందన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీకాళహస్తిలో కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ అమలులో కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment