
సాక్షి, చెన్నై: ప్రేమికుల రోజునే నటుడు బాలాజీకి కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాదల్ చొల్లవందేన్, మెయ్ అళగి, పట్టాలం చిత్రాల్లో నటించిన బాలాజీ రెండేళ్ల క్రితం ప్రీతిని పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత కాలానికే వారి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ప్రేమికుల రోజైన బుధవారం విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. ఈ విషయాన్ని నటుడు బాలాజీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment