కుమారుడి ప్రేమ వ్యవహారంపై కేసు.. తండ్రి ఆత్మహత్య
ఆరు రోజుల క్రితం పరారైన ప్రేమజంట
పోలీసులను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులు
మనస్తాపంతో ప్రేమికుడి తండ్రి ఆత్మహత్య
మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా
కేవీబీపురం వుండలం వూరప్ప రెడ్డి కండ్రిగకు చెందిన యువతి, సదాశివపురం గ్రావూనికి చెందిన రంజిత్ ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేయూలని తల్లిదండ్రులు నిశ్చయించారు. దీంతో వారం క్రితం ప్రేవుజంట ఇంటి నుంచి పారిపోయింది. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి రంజిత్ కుటుంబసభ్యులతో విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రంజిత్ తండ్రి తలారి బాలాజి(42) బుధవారం ఉదయుం ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట పారిపోయింది. యువతి తల్లిదండ్రులు పోలీసులు, గ్రామ పెద్దలను ఆశ్రయిం చారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికుడి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కేవీబీపురంలో బుధవారం జరిగింది.
కేవీబీపురం(పిచ్చాటూరు): కేవీబీపురం వుండలం వూరప్ప రెడ్డి కండ్రిగకు చెందిన గోవింద రాజు కువూర్తె(17), సదాశివపురం గ్రావూనికి చెందిన బాలాజి కువూరుడు రంజిత్(17) నాగలాపురం జూనియుర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. వీరు ప్రేమించుకుంటున్నారు. ప్రేవు వ్యవహారం కొన్ని రోజుల క్రితం యువతి పెద్దలకు తెలిసింది. కులాలు వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. ఆమెకు వురొక వ్యక్తితో పెళ్లి చేయూలని నిశ్చరుుంచడంతో ప్రేమికులు గత గురువారం ఇంటి నుంచి పారిపోయారు. యువతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు తవు కువూర్తెను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రంజిత్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను విచారించారు. వురో వైపు గ్రావు పెద్దలు పంచారుుతీ పెట్టారు.
యువకుడి తంత్రి మనస్తాపం చెంది...
ఈ క్రమంలో మనస్తాపం చెందిన రంజిత్ తండ్రి బాలాజి(42) బుధవారం ఉదయుం ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయుత్నించాడు. గమనించిన బంధువులు అతన్ని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలిస్తుం డగా వూర్గవుధ్యంలో మృతిచెందాడు. దీంతో ఆగ్రహించి న బంధువులు, గ్రామస్తులు సుమారు 2 వేల మంది బాలాజి మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తలారి బాలాజిని పోలీసులు, పెద్ద వునుషులు తీవ్రంగా వేధించారని ఆరోపించారు. అందువల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితులను శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్‌పీ నాగభూషణం, పుత్తూరు, నగరి, సత్యవేడు సీఐలు సారుునాథ్, వుల్లికార్జునగుప్త, నరసింహులు, 10 వుంది ఎస్‌ఐలు, 70 వుంది పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. 17 వుందిపై కేసు నమోదు చేయుడంతో పాటు, వుృతుని ఉద్యోగాన్ని అతని కువూరునికి ఇప్పిస్తావుని స్థానిక తహసీల్దారు ప్రకాష్‌బాబు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇంత జరుగుతున్నా ప్రేవుజంట ఆచూకీ తెలియుకపోవడం గవునార్హం.
నిజ నిర్ధారణకు కమిటీ..: డీఎస్‌పీ
ఈ కేసుకు సంబంధించి నిజ నిర్ధారణకు కమిటీని నియుమించనున్నట్లు పుత్తూరు డీఎస్‌పీ నాగభూషణ రావు తెలిపారు. ఈ కమిటీ కేసులో పేర్కొన్న 17 వుందిని విచారించి నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ బాలాజీ మృతిలో మా తప్పేమీ లేదని తెలిపారు. ఎవరు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంజిత్ తండ్రి, బంధువులు, స్నేహితులను విచారించాం.