Published
Sun, Oct 9 2016 8:56 PM
| Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
మహిషాసురమర్దిని సైకత శిల్పం
మచిలీపట్నం (కోనేరు సెంటర్) : దుర్గాష్టమిని పురస్కరించుకుని కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన సైకతశిల్పి ఆకునూరి బాలాజీవరప్రసాద్ ఆదివారం బందరు మండలం మంగినపూడి బీచ్ ఒడ్డున శ్రీమహిషాసురమర్దిని సైకితశిల్పాన్ని రూపొందించారు. 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున ఈ శిల్పాన్ని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ విజయవాడ ఆధ్వర్యంలో తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని తిలకించేందుకు పర్యాటకులతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిచూపుతున్నారు. బాలాజీ గతంలో వినాయచవితిని పురస్కరించుకుని శైవlగణనాథుడి సైకత శిల్పాన్ని రూపొందించి పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల మన్ననలు అందుకున్నారు.