
రైల్వే వంతెనలు ఏర్పాటు చేయరూ..
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి గురువారం రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు..
రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభును కోరిన మంత్రి మహేందర్‌రెడ్డి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి గురువారం రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుతో భేటీ అయ్యారు. పాత తాండూరు, వికారాబాద్‌లలోని రైల్వే గేట్లతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని ఆయనకు వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే రెండు చోట్ల రైల్వే వంతెనలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు దాదాపు రూ.50కోట్లు అవసరమని, వంతెనలు మంజూరు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందిస్తూ విన్నపాన్ని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.