బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసేవారిపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేస్తామని రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి హెచ్చరించారు. ‘ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే, వారిపై.. హైదరాబాద్ విలీనం సమయంలో సర్దార్ వల్లభాయి పటేల్ చేపట్టిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతాం’ అన్నారు. కఠిన చర్యలు అంటే కనిపిస్తే కాల్చివేతనే అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment