Public property
-
'అడ్డంకులు సృష్టిస్తున్నా ఆగని ప్రగతి.. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గం'
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒత్తిడికి తలొగ్గబోమని, ప్రభుత్వ రంగ ఆస్తులు విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం ఇప్పటివరకు రూ.4.06 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అమ్మిందని చెప్పారు. రాష్ట్రాలపై కూడా ఈ మేరకు ఒత్తిడి తెస్తోందని, అమ్మితే రాయితీలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతోందని, అందుకు అంగీకరించకపోతే నిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టాలని, రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని వెంటబడ్డా తాము అంగీకరించలేదన్నారు. అలా చేస్తేనే రుణ పరిమితిని పెంచుతామన్నా తలొగ్గలేదని స్పష్టం చేశారు. కేంద్రం చెప్పినట్టు వింటే రూ.30 వేల కోట్లు వచ్చేవని, కానీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి తిరస్కరించామన్నారు. సీనియర్లు ఖండించాలి.. రాజకీయ పారీ్టల నేతలు ఇటీవల పేల్చేస్తాం, కూల్చేస్తామంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఆయా పారీ్టల్లో టి.జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు అటువంటి వ్యాఖ్యలను ఖండించాలని హరీశ్‌రావు సూచించారు. ఆ పారీ్టల విధ్వంస భాషను తెలంగాణ ప్రజలు మన్నించరని, వారికి పడే ఓట్లు కూడా పడవని పేర్కొన్నారు. మిగిలిపోయిన దాదాపు 9.5 కి.మీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పని ప్రస్తుత పద్ధతుల్లోనే వచ్చే సంవత్సరంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ.. టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనే ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే విద్యుత్ కొనుగోళ్లు వంటి వాటికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. వడ్డీలేని రుణాల చెల్లింపునకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగా ద్రవ్యవినిమయబిల్లుకు ఆమోదం తెలిపాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. యూపీఏనే నయం.. మోదీ సర్కార్ కన్నా అంతకుముందు పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏనే కొంత నయమని హరీశ్‌రావు అన్నారు. మోదీ ఏలుబడిలో జీడీపీ తగ్గిందని, అప్పులు పెరిగాయని, ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఊడాయని చెప్పారు. మూలధనం పెంచడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సొమ్మును అదాని దారి మళ్లించిన తీరుపై హిడెన్ బర్గ్ నివేదిక సృష్టించిన కలకలానికి మోదీ సమాధానం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తప్పు చేయబట్టే ప్రజలకు సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్ -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు
-
ఆ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నా: పూర్ణ
‘‘సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ అని నా ఫీలింగ్. ప్రజల వల్లే సెలబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.. వాటిని నేను ఒకేలా తీసుకుంటాను. నెగెటివ్ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నాను’’ అని పూర్ణ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణ–బోయపాటిగార్ల కాంబినేషన్లో ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో పద్మావతి అనే పాత్ర చేశాను. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. నా లక్కీ నంబర్ 5. 2021ని కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాది మంచి పాత్రలు వచ్చాయి. హీరోయిన్‌గానే చేయాలని ఫిక్స్ అవ్వలేదు. సినిమాలో నాలుగైదు సీన్లు చేసినా ప్రాధాన్యత ఉండాలనుకుంటాను. శోభన, రేవతి, సుహాసినిగార్లలా ఎలాంటి పాత్రలైనా చేయాలనుకుంటున్నాను. ‘దృశ్యం 2’లో లాయర్‌గా బాగా నటించావని చాలామంది అభినందించారు. కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయింది. ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. కానీ ఇంతదాకా ప్రయాణించాను. డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. కెరీర్ చాలాకాలం సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. ముందు నేను కొన్ని తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు జాగ్రత్తగా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నాను’’ అన్నారు. -
రైల్వేకు నష్టం చేస్తే ‘కనిపిస్తే కాల్చివేత’!
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసేవారిపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేస్తామని రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి హెచ్చరించారు. ‘ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే, వారిపై.. హైదరాబాద్ విలీనం సమయంలో సర్దార్ వల్లభాయి పటేల్ చేపట్టిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతాం’ అన్నారు. కఠిన చర్యలు అంటే కనిపిస్తే కాల్చివేతనే అని పేర్కొన్నారు. -
టీడీపీ నేత చిల్లకొట్టుడు
జిల్లాలో ప్రభుత్వ సంపదకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ నేతలు సర్కార్ ఖజానాకు భారీగా చిల్లులు పెడుతున్నారు. అడిగేవారెవరన్న తలబిరుసుతో గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన ఇతర పార్టీ నేతలపై దాడులకు సైతం తెగబడుతున్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు భద్రత కరువైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాత సామెతకు ఇప్పటి టీడీపీ నేతల తీరు అతికినట్లు సరిపోతోంది. కొండపి మండలంలోని పెట్లూరు కొండపనాయుడు చెరువు, ఊర చెరువుల్లో గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దందా ప్రారంభించాడు. ప్రభుత్వ అనుమతి లేకుండా వాటిలో ఉన్న చెట్లు నరికించి సొమ్ము చేసుకుంటున్నాడని మాజీ సర్పంచ్‌తో పాటు పలువురు చెరువు ఆయుకట్టుదారులు, రైతులు ఆరోపిస్తున్నారు. పెట్లూరుకు పైఎత్తున కొండపనాయుడు చెరువు సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అందులో 50 ఎకరాల్లో చిల్లచెట్లు, నల్లతుమ్మ, తెల్లతుమ్మ చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపు 700 టన్నులు ఉంటాయి. అంతేకాకుండా ఆర్అండ్బీ రోడ్డును ఆనుకుని గ్రామం పక్కనే ఉన్న ఊర చెరువులో సైతం 25 ఎకరాల్లో మరో 250 టన్నుల చిల్లచెట్లు, వేప, తుమ్మ చెట్లు ఉన్నాయి. వీటిపై కన్ను పడిన గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత.. ఎలాగైనా వాటిని సొమ్ము చేసుకోవాలని టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పావులు కదపడం ప్రారంభించాడు. చివరకు ఎటువంటి అనుమతి లేకుండా చెట్లు నరికించే ప్రయత్నానికి తెరలేపాడు. అందులో భాగంగా సంతనూతలపాడు ప్రాంతం నుంచి ఏకంగా 20 మంది కూలీలను తెప్పించి కొండపనాయుడు చెరువులో నాలుగు రోజుల క్రితం వారితో గుడిసెలు సైతం వేయించాడు. కూలీలు రెండు రోజులుగా కట్టెలు కొడుతున్నారు. ఇప్పటికే 20 టన్నుల వరకు విక్రయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును సొంత ఖాతాకు జమ చేసుకుంటున్నా పట్టించుకున్న అధికారులు లేరు. ఈ వ్యవహారంపై ఇప్పటికే చవటపాలెం, పెట్లూరు గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు టీడీపీ నేత అక్రమాన్ని సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన ఆస్తిని ఒకే ఒకరు సొంతం చేసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న సాక్షి విలేకరి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ డీఈ రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. చెట్లు అమ్ముకునేలా పంచాయతీకి కోర్టు ఆర్డర్ ఉన్నట్లు సదరు నేత తనకు చెప్పారని డీఈ పేర్కొన్నారు. 2003లో చెరువుల్లోని చెట్లకు పంచాయతీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా అదే ఇరిగేషన్‌శాఖ అధికారులు పంచాయతీ వేలం పాట ఎలా నిర్వహిస్తుందని, ఆ హక్కు తమశాఖకే ఉందని చెప్పి వేలం పాట ఆపివేయించారు. అప్పటి అధికారులు పంచాయతీకి ఓ నివేదిక కూడా సమర్పించారు. అందులో భాగంగా ఆరేళ్ల క్రితం ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో అధికారులు రెండు చెరువులకు వేలం పాట నిర్వహించారు. పాట పాడుకున్న వారు ఆ నగదును ఇరిగేషన్శాఖకే చెల్లించారు. మరి అప్పుడు ఇరిగేషన్ శాఖ ద్వారా చెరువుల్లోని చెట్లకు వేలం నిర్వహించగా ఇప్పుడు పంచాయతీకి కోర్టు ఆర్డర్ ఉందని డీఈ చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల అడుగులకు అధికారులు మడుగులొత్తుతున్నారని చెప్పేందుకు ఈ చిన్న ఉదాహరణ చాలని పెట్లూరు వాసులు చెబుతున్నారు. కలెక్టర్ విజయకుమార్ తక్షణమే స్పందించి ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని వారు కోరుతున్నారు. చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్న సదరు నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చే స్తున్నారు. -
హుద్‌హుద్ నష్టం రూ.3వేల కోట్లు
విజయనగరం కంటోన్మెంట్: అక్టోబర్ 12న విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాను కారణంగా జిల్లాలో వివిధ శాఖలు, పబ్లిక్ ప్రాపర్టీకి రూ. 2995 కోట్ల నష్టం జరిగిందని కలెక్టర్ ఎం.ఎం నాయక్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళినిలు వివరించారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎం నాయక్ అధికారులతో కలసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నష్టం వివరాలను వివరించారు. గ్రామాల్లో సభలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టాలను నివేదించామన్నారు. తుపాను వల్ల 14 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 15,303 గృహాలు నష్టపోగా రూ.8.42 కోట్ల నష్టం వాటిల్లినట్టు వివరించారు. విద్యుత్ శాఖకు రూ.438 కోట్ల నష్టం జరిగిందనీ, వ్యవసాయ శాఖకు రూ.91 కోట్లు, ఉద్యాన వన శాఖకు రూ.11.83 కోట్లు, మత్స్య శాఖకు రూ.28.37 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. 685 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌లు దెబ్బతిన్నాయనీ, దీని వల్ల 91,656 ఎకరాల ఆయకట్టుకు నష్టం వాటిల్లిందన్నారు. 376 మధ్య తరహా ట్యాంక్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. దీని వల్ల రూ.59 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఆర్‌అండ్‌బీకి 20,890 లక్షల నష్టాన్ని అంచనా వేసినట్లు వివరించారు. పీఆర్, మున్సిపాలిటీలు, వైద్యం, ఫారెస్టు తదితర శాఖలకు తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. ఈ నష్టాలను మండలాల వారీగా నివేదికలు అందజేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో జేసీ బి.రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, మున్సిపల్ చైర్మన్ ప్సాదుల రామకృష్ణ, జెడ్పీ ఉపాధ్యక్షుడు బలగం కృష్ణమూర్తి, ఏజేసీ నాగేశ్వరరావు, డీఆర్వో వై.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ‘తీరప్రాంతాల్లో గృహ నిర్మాణ యూని ట్లకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షలు’జిల్లాలో తీరప్రాంత మండలాల్లో గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి రూ.3.50 లక్షల రూపాయలందేలా యూనిట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు చేశామని రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రూ.4లక్షల వరకూ తీరప్రాంత మండలాల్లో తుపాన్లను తట్టుకునేలా ఇళ్లను నిర్మించే ఆలోచన ఉందని, సీఎం దీన్ని ఆమోదించాల్సి ఉందని తెలిపారు.