రైల్వే టికెట్ల తగ్గింపుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి 'అశ్విని వైష్ణవ్' లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రతి టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ ప్రభుత్వం అందించిన మొత్తం సబ్సిడీ రూ.56,993 కోట్లు అని స్పష్టం చేశారు.
ఒక టికెట్ ధర రూ.100 అయినప్పుడు.. ప్రభ్యుత్వం దీనిని 54 రూపాయలకు అందిస్తుంది. అంటే ఒక టికెట్ మీద అందిస్తున్న రాయితీ 46 శాతం. ఇది అన్ని కేటగిరీ ప్రయాణికులను వర్తిస్తుందని మంత్రి వెల్లడించారు. వేగవంతమైన ట్రైన్ సర్వీసులకు సంబంధించిన ప్రశ్నకు జావాబిస్తూ.. అటువంటి సర్వీస్ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు.
వేగవంతమైన ట్రైన్ సర్వీస్.. భుజ్ & అహ్మదాబాద్ మధ్య ప్రారంభమైంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్ భుజ్ - అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో అధిగమించడం ద్వారా ఇంటర్‌సిటీ కనెక్టివిటీని మెరుగుపరిచిందని వివరించారు. ఈ సేవ ప్రయాణికులకు చాలా సంతృప్తికరంగా ఉందని కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
ఎలాంటి జాప్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మేము ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సరసమైన ధరలతో సులభమైన ప్రయాణం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. రైలు ప్రమాదాల సంఖ్య కూడా బాగా తగ్గిందని.. 2014లో రూ.29,000 కోట్లుగా ఉన్న రైల్వే బడ్జెట్‌ను రూ.2.52 లక్షల కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment