
ఈటెల రాజేందర్
సాక్షి, న్యూఢిల్లీ: పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రాష్ట్రంలో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఈటల నేతృత్వంలోని ఎంపీలు వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముంబై–నిజామాబాద్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని వినతిపత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా కాగజ్‌నగర్–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు ఉప్పల్‌లో, ఇంటర్‌సిటీ, పట్నా ఎక్స్‌ప్రెస్‌కు జమ్మికుంటలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాలకు రైల్వే శాఖ నుంచి రావాల్సిన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని ఈటల కోరారు.