దేశరాజధాని ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సూపర్‌ఫాస్ట్ రైలు ఏపీ ఎక్స్‌ప్రెస్ (22415) బుధవారం లాంఛనంగా విశాఖపట్నంలో ప్రారంభం అయింది. న్యూఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, అశోక్‌గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నుండి ఢిల్లీకి వారంలో మూడు రోజులు బుధ, శుక్ర, ఆది వారాల్లో నడవనుంది. ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో రైలు సేవలు అందుబాటులోకి వస్తామని అధికారులు తెలిపారు. ఈ రైలులో 16 ఏసీ బోగీలు ఏర్పాటు చేశారు.
Published Wed, Aug 12 2015 9:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement