రాజ్నాథ్కు హోం శాఖ... వెంకయ్యకు రైల్వే శాఖ! | Narendra Modi's Cabinet: Rajnath Singh to get home, venkaiah naidu next railway Minister | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్కు హోం శాఖ... వెంకయ్యకు రైల్వే శాఖ!

Published Fri, May 23 2014 12:41 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

రాజ్నాథ్కు హోం శాఖ... వెంకయ్యకు రైల్వే శాఖ! - Sakshi

రాజ్నాథ్కు హోం శాఖ... వెంకయ్యకు రైల్వే శాఖ!

నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రుల ఎంపికపై బీజేపీ కసరత్తు పూర్తి అయింది.

నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రుల ఎంపికపై బీజేపీ కసరత్తు దాదాపు పూర్తి అయిందని ... కేంద్ర మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారి వివరాలను  మీడియా సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్కు కేంద్ర హోం శాఖ... లోక్సభ స్పీకర్గా మురళీ మనోహర్ జోషీని .... అలాగే ఎన్డీఏ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీకి నియమించే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థలు వెల్లడించాయి.

 

కేంద్ర మంత్రుల వివరాలు:

ఆర్థిక శాఖ - సుబ్రహ్మణ్య స్వామి
విదేశీ వ్యవహారాల శాఖ - అరుణ్ జైట్లీ
రక్షణ శాఖ - సుష్మా స్వరాజ్
రైల్వే శాఖ - వెంకయ్య నాయుడు
పట్టణాభివృద్ధి శాఖ - నితిన్ గడ్కరీ
వ్యవసాయ శాఖ - గోపినాథ్ ముండే
గ్రామీణాభివృద్ధి శాఖ - ఆనంత గీతే
ఆరోగ్య శాఖ - హర్షవర్థన్
న్యాయ శాఖ - రవిశంకర్ ప్రసాద్
వాణిజ్య శాఖ - ఎస్ ఎస్ అహ్లూవాలియా
టెలికాం శాఖ- అనంత కుమార్
బొగ్గు శాఖ  - హన్స్రాజ్ అహిర్
పెట్రోలియం శాఖ - రామ్ విలాస్ పాశ్వాన్
భారీ పరిశ్రమల శాఖ - ఆనంద్ రావు అడ్సులు
పౌర విమానయాన శాఖ - షానవాజ్  హుస్సేన్
మైనారిటీ శాఖ - ముక్తార్ అబ్బాస్ నక్వీ
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ - సులన్ మిత్ర మహాజన్
మహిళ మరియు శిశు సంక్షేమం - అను ప్రియా పటేల్
మానవ వనరులు అభివృద్ధి శాఖ - బీఎస్ యాడ్డ్యురప్ప
నీటి వనరుల శాఖ - పురుషోత్తం రుపాలా
క్రీడ శాఖ - కిర్తీ ఆజాద్
పర్యాటక శాఖ - శ్రీపాద్ నాయక్
సాంస్కతిక శాఖ - మీనాక్షి లేఖి
సమాచారా శాఖ - జగదాంబికా పాల్
కార్పొరేట్ వ్యవహారాల శాఖ - అనురాగ్ ఠాకూర్
సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ - బీసి ఖండూరీ
ప్రవాసీ భారతీయ వ్యవహారాలు (ఎన్నారై శాఖ )- రాజీవ్ ప్రతాప్ రూడీ
సామాజిక న్యాయం - బండారు దత్తాత్రేయ

సహాయ మంత్రులు :
హోం శాఖ - సత్యపాత్ సింగ్
రక్షణ - వీకే సింగ్
వ్యవసాయం - రాజు శెట్టి
సామాజిక న్యాయం - రామదాస్ అతవాలే
న్యాయశాఖ - కీరిటి సోమయ్య
క్రీడ శాఖ - రాజ్యవర్థన్ రాధోడ్

తొమ్మిది దశలలో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా 543 స్థానాలకు గాను బీజేపీ 282 స్థానాలలో విజయ ఢంకా మోగించింది. ఎన్టీఏ భాగస్వామ్య పక్షాలు ( 29 పార్టీలు) మొత్తం 336 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిందే. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement