నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్
– హాజరు కానున్న రైల్వే మంత్రి, ముఖ్యమంత్రి
నంద్యాల: నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ఆగస్టు 2న ప్రారంభించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. మంత్రి సురేష్‌ప్రభును రైల్వే జనరల్‌మేనేజర్ రవీంద్రగుప్త బుధవారం ఢిల్లీలో కలిశాక ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.