కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రి ఆదివారం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నివేదికను సురేష్ ప్రభుకు అందజేశారు.
తెలంగాణలో కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనల గురించి కేసీఆర్ చర్చించారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సురేష్ ప్రభుకు విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరతిగతిన పూర్తి చేయాలని, దక్షిణ మధ్య రైల్వే నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన 34 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని కేసీఆర్ కోరారు.