రైల్వేల సామర్థ్యం పెంపు, విస్తరణకే పెద్దపీట
ప్రయాణికులకు హైటెక్ సౌకర్యాలు,
మెరుగైన సదుపాయాలు.. మరిన్ని స్టేషన్లలో
వైఫై, రైళ్లలో వినోదం, భద్రతాచర్యలు
రైళ్లు, స్టేషన్ల పరిశుభ్రతకు ‘స్వచ్ఛ రైల్’
ప్రయాణ చార్జీల్లో పెంపులేదు
సరుకు రవాణా చార్జీలు 10 శాతం పెంపు
దీంతో రూ. 4 వేల కోట్ల అదనపు ఆదాయం
ఆహారధాన్యాలు, సిమెంట్,
ఇనుము, బొగ్గు, గ్యాస్‌లపై భారం
రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులతో
ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక
9 కారిడార్లలో వేగం 200 కి.మీ. వరకూ పెంపు
కొత్త రైళ్లు, కొత్త మార్గాలను తర్వాత ప్రకటిస్తాం
పార్లమెంటుకు 2015-16 రైల్వే బడ్జెట్‌ను సమర్పించిన రైల్వేమంత్రి సురేశ్ ప్రభు
ఆధునీకరణ పట్టాలపైకి ‘ప్రభు రైలు’ పరుగులు
భారతీయ రైల్వే వ్యవస్థను ‘హైటెక్’ మార్గంలో నడిపే దిశగా రైల్వేమంత్రి సురేశ్ ప్రభు తొలి రైల్వేబడ్జెట్‌ను ఆవిష్కరించారు. కొత్త రైళ్లు, కొత్త మార్గాలు, కొత్త ప్రాజెక్టులు వంటి ప్రకటనలు పక్కనపెట్టి.. వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచటం, మరింతగా విస్తరించటం, బలోపేతం చేయటం, ప్రమాణాలను మెరుగుపరచటానికే పూర్తి ప్రాధాన్యమిచ్చారు. ఎన్‌డీఏ సర్కారు ‘స్మార్ట్’ ప్రణాళికలు, ‘స్వచ్ఛ’ కార్యక్రమాలకు అనుగుణంగా.. రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే సేవలు, సదుపాయాలను సాంకేతికంగా ఆధునీకరించే ప్రణాళికలు ప్రకటించారు. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యంతో మొదలుపెట్టి.. ప్రయాణికుల సదుపాయాలు, సౌకర్యాలను ఆధునీకరించటం కోసం తాజా బడ్జెట్‌లో రూ. 12,500 కోట్లు కేటాయించారు. రైళ్ల వేగాన్ని గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వరకూ పెంచుతామన్నారు. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తామని.. ప్రయాణికులకు భిన్నమైన అనుభవాన్ని అందిస్తామని ప్రకటించారు.
చుక్ చుక్... హైటెక్ !
Published Fri, Feb 27 2015 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement