
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే లక్షకుపైగా కరోనా కేసులు నమోదు కాగా తాజాగా మాజీ ప్రధాన మంత్రికి, ప్రస్తుత రైల్వే మంత్రికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ రాయబారి మర్యం జౌరంగజేబ్ సోమవారం వెల్లడించారు. (పాక్లో లక్షకు చేరువలో కరోనా కేసులు)
మాజీ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసి (61) , రైల్వే శాఖా మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌కు సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని జౌరంగజేబ్ తెలిపారు. 2017 ఆగస్టు నుంచి మే 2018 మధ్య నవాబ్‌షరీఫ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబ్బాసీ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో అబ్బాసీ ఆయన ఇంటిలోనే స్వీయ నిర్భంధంలోకి వెళ్లి పోయారు. రైల్వే మంత్రి షేక్ రషీద్ కూడా కరోనా వైరస్ సోకిందని నిర్థారణ కావడంతో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. వైద్యుల సలహా మేరకు ఆయన రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంటారని ఔరంగజేబు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత మాజీ మంత్రి షర్జీల్ మీమొన్‌కు ఆదివారం కరోనా సోకిన సంగతి తెలిసిందే. (రూ. 75 వేలకు ఆర్మీ సమాచారం అమ్మేశారు!)
Comments
Please login to add a commentAdd a comment