
న్యూఢిల్లీ: భద్రక్-విజయనగరం మధ్య 2015-16 రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడో రైల్ లైన్ నిర్మాణానికి ఇంకా ఆమోదం పొందలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూపొందించిన డీపీఆర్ ప్రకారం 385 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ.3,823 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆమోదానికి నోచుకోకపోవడంతో కాలయాపన వలన ప్రాజెక్ట్ వ్యయం పెరిగే అవకాశమే లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment