సప్త వాహనాలపై తిరుమలేశుడు
తిరుమల : సూర్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించే రథసప్తమి వేడుకలతో తిరుమల పులకించిపోతోంది. ఏడుకొండలూ గోవింద నామస్మరణతో గురువారం మారుమోగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఏడు వాహానాల్లో తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు.
ఉదయం 5గంటలకు సూర్యప్రభ వాహనంలో .. 9గంటలకు చిన్నశేష వాహనం,11 గంటలకు గరుడ వాహనంపై ఊరేగారు. ఒంటి గంటకు హనుమంత వాహనంలో విహరించిన అనంతరం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఆ తరువాత కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం..చంద్రప్రభ వాహనసేవలతో స్వామివారు ఊరేగుతారు. శ్రీవారి వాహన సేవలను తిలకించి.. భక్తులు తరిస్తున్నారు.