rathasapthami
-
ఫిబ్రవరి 4న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి
తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.తెల్లవారు జామున 3 నుండి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీగోవిందరాజస్వామి వారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం, మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.రాత్రి 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు గరుడ వాహనాన్ని అధిష్టించి శ్రీవారు దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవమని, ఒక రోజు బ్రహ్మోత్సవమని కూడా భక్తులు అంటారు. TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంతిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి రెండు కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు74,742 మంది స్వామివారిని దర్శించుకోగా 22,466 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ట్రాఫిక్ ఆంక్షలు తప్పనిసరి
అరసవల్లి: రథసప్తమి ఉత్సవం సందర్భంగా అరసవల్లి పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో కూడా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని, ఈ నిబంధనలను అందరూ పాటించి సహకరించాలని ట్రాఫిక్ డీ ఎస్పీ సీహెచ్ పెంటారావు కోరారు. శనివారం ఉదయం ఆయన అరసవల్లి ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు ఈనెల 23 రాత్రి నుంచి 24 వ తేది రాత్రి వరకు (రథసప్తమి ఉత్సవం ముగిసినంత వరకు) ట్రాఫిక్ సంబంధించి పలు నిబంధనలను విధించామన్నారు. ముఖ్యంగా అరసవల్లికి వచ్చే వాహనా లన్నీ దాదాపుగా 80 ఫీట్ రోడ్డులోనే నిలిపివేస్తామని, కేవలం వీవీఐపీలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వాహనాలు మాత్రమే అరసవల్లి జంక్షన్‌ను దాటి అనుమతిస్తామని, మళ్లీ ఇందులో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలు మాత్రమే ఆలయ ప్రధాన ముఖ ద్వారం (ఆర్చిగేటు) వరకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే మొత్తం పార్కింగ్ కోసమే 12 స్థలాలను ఏర్పాటు చేశామని వివరించారు. ► శ్రీకాకుళం నగరం నుంచి అరసవల్లి వైపుగా వచ్చిన వారి వాహనాలకు 80 ఫీట్ రోడ్డులోనే బైకులు, కార్లు, బస్సులకు వేర్వేరుగా 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ► అలాగే గార నుంచి వచ్చే వాహనాల కోసం వాడాడ కూడలి లోనూ, అరసవల్లి అసిరితల్లి ఆలయం వద్ద వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. ► గార నుంచి నగరానికి వచ్చే బస్సులు, ఇతర వాహనాలన్నీ వాడాడ మీదుగా కలెక్టరేట్, ఓబీఎస్ మీదుగా వెళ్లాలని సూచించారు. ► నగరం నుంచి గార, శ్రీకూర్మం వైపు వెళ్లే వాహనాలు కూడా జాతీయ రహదారి మీదుగా వెళ్లి, అంపోలు (జిల్లా జైలు రోడ్డు) మీదుగా ఓ మార్గంలో వెళ్లాలని, అలాగే సింగుపురం (బూరవల్లి రోడ్డు) మీదుగా కొన్ని వాహనాలు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ► శ్రీకాకుళం నగరంలో కూడా రథసప్తమి రోజున పూర్తిగా వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నామని, అరసవల్లి రావాల్సిన అన్ని వాహనాను కాంప్లెక్స్, రామలక్ష్మణ కూడలి, సూర్యామహల్ మీదుగా అరసవల్లి జంక్షన్ (80 ఫీట్ రోడ్డు)కు చేరుకుంటాయని, తిరిగి వెళ్లే వాహనాలన్నీ మిల్లు జంక్షన్ నుంచి ఓబీఎస్ మీదుగా నగరంలోకి వెళ్లాలని, అలాగే జీటీ రోడ్డును కూడా వెళ్లే మార్గంగానే గుర్తించామని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కచ్చితంగా పౌరులంతా పాటించాలని లేదంటే చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట సిఐ బి.ప్రసాదరావు, వన్‌టౌన్ ఎస్సై చిన్నంనాయుడు తదితరులున్నారు. -
‘సన్’దోహం
అంబరాన్నంటిన రథసప్తమి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన సూర్యనారాయణ మూర్తి ఆలయాలు ఆదిత్యుడికి ఘనంగా పూజలు ∙వైభవంగా రథోత్సవాలు జి.మామిడాడ(పెదపూడి) : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జి.మామిడాడ గ్రామంలోని సూర్యనారాయణ మూర్తి స్వామి వారి రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. సూర్యభగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి పర్వదినం సందర్భంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 5.45 గంటలకు భక్తులు ఆలయ ప్రాంగణంలో సూర్యనమస్కారాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక, విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో సిద్ధం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం సూర్యభగవానుని దేవేరులైన ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ ఉత్సవ మూర్తులతో కలిసి పల్లకిలో ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేయించి, ఆలయం బయట ఉంచిన రథంలో పెట్టారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వామి వారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ఉత్సవ కమిటీ, గ్రామస్తులు, భక్తులు, గ్రామయూత్ సూర్యనారాయణ నామస్మరణతో ఉత్సహంగా రథాన్ని ముందుకు లాగారు. ఆలయ ఈఓ మోర్త మురళీ వీరభద్రరావు, ఆలయ «వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మ¯ŒS కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు, అమృతకుండి ప్రసాద వినియోగాలు నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన జి.మామిడాడలో సూర్యనారాయణమూర్తి స్వామి వారిని దర్శించుకున్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఈ ఆలయాన్ని త్వరలో అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. అంతర్వేదిలో రథసప్తమి వేడుకలు... మలికిపురం, సఖినేటిపల్లి : రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఇంటింటా సూర్యభగవానుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. లోకబాంధవుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనను భక్తులు భక్తిశ్రద్థలతో కొలిచారు. తొలి సంధ్యవేళ లేలేత సూర్యకిరణాలు మధ్య భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శిరస్సు, భుజాలపై తెల్లజిల్లేడు ఆకులు, రేగిపండ్లు పెట్టుకుని, సంప్రదాయ ప్రకారం స్నానాలు చేశారు. ఇంటింటా భక్తులు క్షీరాన్నం వండి, చిక్కుడు ఆకులపై పెట్టి, శ్రీసూర్యనారాయణ స్వామికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. వైష్ణవ ఆలయాల్లో భక్తులు స్వామికి పూజలు నిర్వహించారు. అంతర్వేదిలో వేకువజామున నుంచి సముద్ర స్నానాలు ఆచరించి వచ్చిన భక్తులతో శ్రీలక్షీ్మనృసింహస్వామి ఆలయం కిక్కిరిసింది. అమరగిరిమెట్టపై సూర్యభగవానునికి పూజలు పెద్దాపురం : స్థానిక అమరగిరి మెట్ట (పాండవుల మెట్ట)పై కొలువై ఉన్న సూర్యనారాయణమూర్తికి రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మున్సిపల్ చైర్మన్ సూరిబాబురాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. వారికి ఆలయ కమిటీ నిర్వాహకులు వాణి, లక్ష్మి ఆయన వేదపండితుల మంత్రోచ్ఛరణల మ««దl్య ఘన స్వాగతం పలికారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు చేశారు. పంచారామ క్షేత్రంలో .. సామర్లకోట : స్థానిక పంచారామ క్షేత్రంలోని సూర్యనారాయణమూర్తికి శుక్రవారం పూజలు, అభిషేకాలు, కల్యాణం నిర్వహించారు. అన్నదాన ట్రస్టు నాయకుడు బిక్కిన సాయి పరమేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం నిర్వహించారు. ఆలయ అభిషేక పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, వేదపండితులు కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, వెంకన్న పూజలు నిర్వహించారు. ఈవో పులి నారాయణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS కంటే జగదీష్‌మోహనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
తిరుమలలో వైభవంగా రథ సప్తమి
-
తిరుమలలో రథసప్తమి వేడుకలు
-
తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకూ సప్తవాహన సేవలు, చక్రస్నానం నిర్వహించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం హనుమంతవాహనం, చక్రస్నానం, సాయంత్రం కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, చంద్ర వాహనంపై శ్రీవారు నాలుగు మాడా వీధుల్లో ఊరేగనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దుచేశారు. -
తిరుమల రథసప్తమి బ్రహ్మోత్సవం
-
సప్త వాహనాలపై తిరుమలేశుడు
తిరుమల : సూర్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించే రథసప్తమి వేడుకలతో తిరుమల పులకించిపోతోంది. ఏడుకొండలూ గోవింద నామస్మరణతో గురువారం మారుమోగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఏడు వాహానాల్లో తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఉదయం 5గంటలకు సూర్యప్రభ వాహనంలో .. 9గంటలకు చిన్నశేష వాహనం,11 గంటలకు గరుడ వాహనంపై ఊరేగారు. ఒంటి గంటకు హనుమంత వాహనంలో విహరించిన అనంతరం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఆ తరువాత కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం..చంద్రప్రభ వాహనసేవలతో స్వామివారు ఊరేగుతారు. శ్రీవారి వాహన సేవలను తిలకించి.. భక్తులు తరిస్తున్నారు. -
నేడు రధసప్తమి