తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకూ సప్తవాహన సేవలు, చక్రస్నానం నిర్వహించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం హనుమంతవాహనం, చక్రస్నానం, సాయంత్రం కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, చంద్ర వాహనంపై శ్రీవారు నాలుగు మాడా వీధుల్లో ఊరేగనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దుచేశారు.