festivities
-
మెహిందీ ఫంక్షన్‌కి, పర్ఫెక్ట్ మ్యాచ్ మస్టర్డ్ ఎల్లో ఘరారా (ఫోటోలు)
-
ప్రారంభం కానున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు విష్వక్సేనా ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 28న సీఎం రాక యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి స్వయంభు దర్శనభాగ్యం కలిగించే ఉద్ఘాటన కార్యక్రమం నిమిత్తం ఈ నెల 28న సీఎం కేసీఆర్ రానున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్యర్వంలో ప్రధానాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే, 28వ తేదీకి ముందు కూడా ఒకరోజు సీఎం యాదాద్రిని సందర్శించి పనులు పరిశీలిస్తారని తెలిసింది. ఆ తేదీ ఇంకా ఖరారు కాలేదు. మహాసుదర్శన యాగం వాయిదా పడిన నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మరో యాగం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఆలయ అర్చకులతో అధికారులు చర్చిస్తున్నారు. ఉద్ఘాటన పనులపై సమీక్ష యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఇతర శాఖల అధికారులతో సమీక్షాసమావేశం జరిగింది. ప్రధానాలయం ప్రారంభించే తేదీ కంటే ముందుగానే కొండకింద ఆలయ నగరిలో చేపట్టిన పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు. తుదిదశలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. ప్రధానం గా యాగస్థలి కోసం ప్రతిపాదించిన స్థలాన్ని చదును చేయడం, అంతర్గత రోడ్లు, అన్నప్రసాద సత్రం, సత్యనారాయణవ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్, గండిచెరువు, కొండపైకి నిర్మిస్తున్న రెండు ఫ్లైఓవర్లు, కొండపైన బస్బే, ప్రధాన ఆర్చీ పనులను వేగంగా పూర్తిచేయాలని, పార్కింగ్, సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పూర్తి అయిన పుష్కరిణి, దీక్షాపరుల మండపం తుదిమెరుగులు దిద్దాలని యోచిస్తున్నారు. -
బెజవాడలో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు
విజయవాడ: టీటీడీ ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో పి.భాస్కర్ వెల్లడించారు. నగరంలోని పీడబ్ల్యూడీ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయం, ఇతర ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇక్కడి భక్తులు దర్శించేందుకు వీలుగా వైభవోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీవారి సేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇప్పటివరకు విశాఖపట్నం, గుంటూరు, ముంబయి, హైదరాబాద్ ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో నాడు-నేడు అనే అంశంతో ఆకట్టుకునేలా ఫొటో ఎగ్జిబిషన్, సర్వాంగసుందరంగా పుష్పాలంకరణ, ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా విద్యుద్దీపాలంకరణ, దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. భక్తులకు సేవలందించేందుకు స్థానిక శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు. ఉత్సవాల కోసం శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తామని జేఈవో తెలిపారు. ప్రత్యేక సేవల్లో భాగంగా జులై 4న అష్టదళ పాదపద్మారాధన, 5న సహస్రకలశాభిషేకం, 6న తిరుప్పావడ, 7న అభిషేకం, 8న వసంతోత్సవం, శ్రీనివాస కల్యాణం, 9న పుష్పయాగం నిర్వహిస్తామని వెల్లడించారు. అంతకు ముందు శ్రీవారి నమూనా ఆలయం, క్యూలైన్లు, పార్కింగ్ తదితర ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. -
తిరుమలలో రథసప్తమి వేడుకలు
-
తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకూ సప్తవాహన సేవలు, చక్రస్నానం నిర్వహించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం హనుమంతవాహనం, చక్రస్నానం, సాయంత్రం కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, చంద్ర వాహనంపై శ్రీవారు నాలుగు మాడా వీధుల్లో ఊరేగనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దుచేశారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
తెలంగాణ అవతరణ వేళ.. నగరం గులాబీమయం అంబరమంటే సంబురాలకు ఏర్పాట్లు సర్వత్రా ‘ఆవిర్భావ’ సందడి సకల జనులూ అదే ధ్యాసలో.. దశాబ్దాల ఎదురుచూపులు ఫలించే తరుణం.. ఏళ్ల తరబడి సాగిన సుదీర్ఘ పోరాటానికి చరమగీతం పాడే సమయం.. కోట్లాదిమంది స్వప్నం సాకారమయ్యే క్షణం.. తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరిస్తున్న వేళ.. అంబరమంటే సంబురానికి తెర లేవనుంది.. ఆ అపురూప దృశ్యాన్ని ‘నభూతో.. నభవిష్యతి’ అన్న రీతిలో జరుపుకోవడానికి నగరం సంసిద్ధమవుతోంది. ఎక్కడ చూసినా విద్యుల్లతలు.. వెలుగుజిలుగులు.. భారీ హోర్డింగులు.. ఎత్తై కటౌట్లు.. రంగుల హంగులు.. నింగికెగసే బెలూన్లు.. ఉత్సవ వేదికలు.. డీజేలు.. బాజాలు.. వెరసి పండగ వాతావరణం ప్రతిబింబించేలా సిటీని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ర్యాలీలు, ధూంధాంలు.. ఉత్సవాలు, జెండా ఆవిష్కరణలు చేపట్టేందుకు వివిధ సంఘాలు సిద్ధమవుతుండగా.. అవతరణ దినోత్సవాన్ని మధురస్మృతిగా పదిల పరుచుకునేందుకు వివాహాల వంటి శుభకార్యాలు ఆ రోజే చేసుకునే హడావుడిలో పలువురు తలమునకలై ఉన్నారు. వెరసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో కసరత్తు జరుగుతోంది. సాక్షి, సిటీబ్యూరో : ‘గ్రేటర్’లో పార్టీలకతీతంగా తెలంగాణప్రాంత వాసులంతా తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాల్లో భాగస్వాములవుతుండగా, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) సైతం ఉత్సవ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాలుపంచుకుంటోంది. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా, గన్‌పార్కు, పరేడ్ గ్రౌండ్.. ఇలా ఉత్సవాలకు వేదికలు కానున్న పలు ప్రాంతాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. వివిధ మార్గాల్లో రహదారులను తీర్చిదిద్దడంతోపాటు, పచ్చదనం పెంపు, డివైడర్లకు రంగులు తదితర కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఆదివారం రాత్రి నుంచి వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనుంది. పలు ప్రాంతాలు విద్యుద్దీప కాంతులతో వెలుగుపూలు విరజిమ్మనున్నాయి. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళలు సైతం ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. వీరు రహదారులు, పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాలు, వేదికల ఏర్పాటు తదితర కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆహారపొట్లాలు, మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలకూ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. తెలుగుతల్లి జంక్షన్, అబిడ్స్ జీపీఓ, రాజ్‌భవన్ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ క్లాక్‌టవర్, శిల్పారామం, చార్మినార్, అసెంబ్లీ, సచివాలయం, పరేడ్‌గ్రౌండ్ ఇంకా.. ఇంకా పలు ప్రాంతాలు విద్యుల్లతలతో వెలుగులు పంచనున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సీనియర్ అధికారులతో కలిసి శనివారం రాత్రి నందినగర్, బంజారాహిల్స్, గన్‌పార్క్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ తదితర ప్రాంతాల్లో రహదారులు.. వీధిదీపాల ఏర్పాట్లు తదితర పనుల్ని తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ... వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, ధూంధాంలు, బతుకమ్మలు, గాల్లోకి బెలూన్లు, బాణసంచా వెలుగులు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫైర్డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజాలో కనీవినీ ఎరుగని రీతిలో వెలుగుపూల బాణసంచా కాల్చనున్నారు. సోమవారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక నగరంలోని దాదాపు 50 ప్రాంతాల్లోనూ బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. కూకట్‌పల్లిలో బతుకమ్మలు, బెలూన్లు.. బాణసంచా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరదల నుంచి ఎందరినో కాపాడిన ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వద్ద సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధురస్మృతిగా మల్చుకునే ప్రయత్నంలో.. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని మరపురాని మధురస్మృతిగా మిగుల్చుకునేందుకు కొందరు నిశ్చితార్ధాలు చేసుకుంటుండగా, మరికొందరు పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలు కొందరు జూన్ రెండో తేదీన శిశువులకు జన్మనిచ్చేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. ఇలా అన్ని వర్గాలవారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాన్ని మరచిపోని జ్ఞాపకంగా పదిల పరచుకునేందుకు, ఘనంగా నిర్వహించుకునేందుకు సంసిద్ధులై ఉన్నారు. ఆనంద ఘడియల్ని ఆస్వాదించేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. -
కేక్మిక్సింగ్లో మంచు విష్ణు హల్చల్