పెద్ద నోట్ల రద్దు వల్ల తోపుడు బండ్లు, చిల్లర దుకాణాలు మొదలు మాల్స్ వరకు వ్యాపారాలు పడిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. బంగారం షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతున్నా.. వడ్డికాసులవాడు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీపై ఏమాత్రం ప్రభావం పడలేదు. మునిపటి కంటే ఎక్కువగా శ్రీవారికి కానుకలు పోటెత్తుతున్నాయి.