
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి విచ్చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానంతరం వకుళమాతను దర్శించుకుని, కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు లడ్డూ, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట స్థానిక జడ్జి శేషాద్రి కూడా పాల్గొన్నారు.