
శ్రీవారికి కారు విరాళం
తిరుమల శ్రీవారికి ఆదివారం రూ.14 లక్షల విలువ కలిగిన కారు విరాళంగా అందింది.
తిరుమల : తిరుమల శ్రీవారికి ఆదివారం రూ.14 లక్షల విలువ కలిగిన కారు విరాళంగా అందింది. అనంతపురంలోని శ్రీదుర్గ మారుతి ఆటోమోటివ్స్ సంస్థ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు ఈ విరాళాన్ని ఇచ్చారు. శ్రీవారి ఆలయం వద్ద కారుకు ప్రత్యేక పూజలను నిర్వహించి టీటీడీ అధికారులకు వాహన తాళాలను అందజేశారు.