తిరుమలలో శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు మంగళవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఇటీవల విడుదలై విజయఢంకా మోగిస్తున్న దూసుకెళ్తా చిత్రం విజయోత్సవంలో భాగంగా హీరో మంచు విష్ణువర్థన్ తన చిత్ర యూనిట్తో కలసి ఈ రోజు ఉదయం కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... దూసుకెళ్తా చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆ చిత్రాన్ని తమిళ వర్షన్లో త్వరలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయన్నారు. అలాగే ప్రముఖ నటీ మంజుల కుమార్తె , వర్థమాన నటీ శ్రీదేవి కూడా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో నటీ శ్రీదేవి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.