వేంకటేశ్వరుడిని శుక్రవారం తిరుమల మాడ వీధుల్లో అప్రదక్షిణంగా ఊరేగించనున్నారు. 'బాగ్ సవారీ' ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనుంది.
వేంకటేశ్వరుడిని శుక్రవారం తిరుమల మాడ వీధుల్లో అప్రదక్షిణంగా ఊరేగించనున్నారు. 'బాగ్ సవారీ' ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనుంది. గురువారం సాయంత్రం ధ్వజావరోహణతో బ్రహ్మోత్సవాలు ముగిసిన సంగతి తెలిసిందే.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు వెల్లువెత్తుతున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.