తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి ఈనెల 18వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు. ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కార్తీకమాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున యాగం నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది.
తామర, మల్లె, చామంతి, సంపంగి, రోజా, మరువం, దవనం, తులసి, గన్నేరు, నందివర్థనం వంటి 20 రకాలకు పైగా సంప్రదాయ పుష్పాలతో స్వామివారికి నివేదన చేస్తారు. తాయార్లు, మలయప్ప సమక్షంలో అగ్నిప్రతిష్ట చేసి బిల్వ పత్రాలతో 108 సార్లు హోమం నిర్వహిస్తారు. పుష్పాధిపతిని ఆవాహనం చేసి 12 పర్యాయాలు వైష్ణవాంతంగా యాగం పూర్తి చేసి ఉత్సవర్లకు తిరుమంజనం, అభిషేకం, నైవేద్య, హారతులు ఇవ్వనున్నారు.