pushpayagam
-
శ్రీవారి పుష్పయాగం.. పలు ఆర్జిత సేవలు రద్దు
-
వామ్మో.. ఎంత పామో!
తిరుమల: తిరుమల జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని నర్సరీలో మంగళవారం ఏడు అడుగుల జెర్రిపోతు భయభ్రాంతులకు గురిచేసింది. నర్సరీలో పనిచేస్తున్న కార్మికులు పామును చూసి, ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు. ఆయన పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో వదిలేశారు.9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం జరగనున్నది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా పుష్పయాగానికి అంకురార్పణ సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే పుష్పయాగం రోజున కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలు రద్దయ్యాయి. 11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’తిరుపతి (అలిపిరి): కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో ‘మనగుడి’ నిర్వహించనున్నట్టు టీటీడీ మంగళవారం ఓ ప్రకటలో తెలిపింది. దీన్లోభాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో రెండు చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు, జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. -
శ్రీవారి పుష్పయాగ మహోత్సవం
-
వేడుకగా వెంకన్న పుష్పయాగం
సాక్షి, తిరుమల: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేశారు. చామంతి, వృక్షి, సంపంగి, సెంటు జాజులు, పొగడ, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుండి 4 టన్నులు, కర్ణాటక నుండి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కలిపి ఒక టన్ను పుష్పాలు, పత్రాలను దాతలు అందజేశారు. -
అలంకార ప్రియుడికి పుష్పయాగం
శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. ఆభరణాలతో పాటు పుష్పాలంకరణ కూడా స్వామివారికి విధిగా నిర్వహిస్తారు. పుష్పాలంకరణలో ఉన్న ఆ శేషాచలవాసుడి నిలువెత్తు రూపాన్ని దర్శించుకోవడానికి రెండు కళ్లు చాలవు. భక్తులు తన్మయత్వంతో పొంగిపోతారు. తిరుమలలోని ప్రతి పుష్పం పుష్పించి, వికసించి సేవించి తరిస్తోంది. అలాంటి అలంకార ప్రియుడికి సోమవారం మధ్యాహ్నం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు ఆగమ శాస్త్రోక్తంగా సంప్రదాయ పుష్పలు,పత్రాలతో శాస్త్రోక్తంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని అర్చించనున్నారు. సోమవారం ఉదయం వైభవంగా పుష్పయాగం ప్రారంభమైంది. పుష్పాల బుట్టలతో స్వామివారిని అధికారులు ఆలయానికి తీసుకు వచ్చారు. సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి వైభవాన్ని, సేవలను కళ్లారా తిలకించి తరించడం పూర్వజన్మ సుకృతం. ఏటా స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తెలిసీ, తెలియక జరిగే తప్పులకు మన్నింపు కోరతూ శ్రీవారికి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. గతంలో బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజున ఈ పుష్పయాగాన్ని నిర్వహించేవారు. అయితే స్వామివారి సేవల్లో జరిగే తప్పులకు మన్నింపు కోరుతూ పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నందున ఈ ఉత్సవాన్ని కార్తీక మాసానికి మార్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. స్వామివారికి కార్తీక శ్రవణా నక్షత్రం రోజున ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి నిత్యారాధన అనంతరం బంగారు తిరుచ్చిలో శ్రీదేవి,భూదేవి సమేతంగా రాచమర్యాదలతో యాగశాలకు వేంచేస్తారు. అక్కడ స్వామివారికి తొలుత అభిషేకాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి తులసిమాలలు ధరింపజేస్తారు. అనంతరం సహస్రధారాభిషేకంతో అభిషేకం కొనసాగిస్తారు. విష్ణుగాయత్రీ మహామంత్రంతో 108 సార్లు బిల్వపత్ర హోమం నిర్వహిస్తారు. మూర్తి హోమంతో 12 సార్లు పుష్పాధిపతికి సంబంధించిన హోమం కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి పుష్ప సమర్పణలో భాగంగా స్వామివారి కంఠం వరకూ వివిధ రకాల పుష్ప సమర్పణ జరుగుతుంది. అర్చకులు అ పుష్పాలను పాద పద్మములకు సరిగా సరిచేస్తారు. అప్పుడు నీరాజనం జరుగుతుంది. ఇదేవిధంగా 20 పర్యాయాలు చేస్తారు. ఆపై హవిర్నవేదనం జరిగుతుంది. తదనంతరం అగ్ని విసర్జనం కూడా జరుపుతారు. స్వామిదేవేరులతో సన్నిధానం చేరుకుంటారు. దీంతో పుష్పయాగం ముగుస్తుంది. పూల బావికే సొంతం శ్రీవారికి అలంకరించిన, వినియోగించిన పుష్పాలను ఎవ్వరికీ ఇవ్వరు. ప్రతి పుష్పాన్ని ఆలయంలోని బావిలో వేస్తారు. ఆలయంలోని అద్దాల మండపానికి ఉత్తర దిశలో పూలబావి ఉంది. దీనినే భూతీర్థం అని కూడా అంటారు. ఇందులో వేసిన పూలను తర్వాత స్వామివారి పూతోటకు ఎరువుగా వినియోగిస్తారని టీటీడీ ఉద్యానవన విభాగం తెలుపుతోంది. నిత్యం పుష్పార్చనే తిరుమల శ్రీవారికి ఒకరకంగా నిత్యం పుష్పాభిషేకమే. రోజూ 18 రకాల పుష్పాలతో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి పుష్పార్చన చేస్తారు. ఇందులో చామంతి, సంపంగి, రోజా, నందివర్ధనం, మరువం, దవనం, పన్నీరుఆకు, తులసి, మల్లెలు, కనకాంబరాలు, మొలలు, సెంటుజాజులు, తామర, కలువ, మొగిలిరేకులు తదితర పుష్పాలను సమర్పిస్తారు. కేవలం ఒక్కరోజు స్వామివారి అలంకరణకు 120 కేజీల పుష్పాలు వినియోగిస్తారు. నిత్య సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవవరకు జరిగే ప్రతి సేవలో 60 కిలోల పుష్పాల వినియోగం ఉంటుంది. వీటితోపాటు ప్రతి గురువారం శ్రీవారికి పూలంగిసేవ నిర్వహిస్తారు. ఈసేవలో 100 నుంచి 120 కేజీల పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వామివారి నిత్య సేవలో ప్రశస్తమైన తోమలసేవకు 60 కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామివారికి పూల హారాలను మార్చుతారు. శ్రీవారి తలనుంచి భుజం వరకు అమర్చే పూలసెట్ను శిఖామణి అంటారు. భుజాల నుంచి పాదాల వరకు అలంకరించే పూలమాలను సాలిగ్రామం అంటారు. వక్షస్థలంలో ఉండే శ్రీదేవి, భూదేవి, కంఠహారం అలంకరణలు అన్నింటినీ కలిపి తోమాలసెట్ అంటారు. ఇలా నిత్యం తిరుమల స్వామి అలంకరణ, ఉత్సవాలు, సేవల్లో అలంకరణకు వందలాది కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఎన్ని పుష్పాలో.. పత్రాలో.. తిరుమల ఆలయంలోని కల్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగే పుష్పయాగంలో 7 నుంచి 10 టన్నుల సంప్రదాయ పుష్పాలను ఉపయోగించనున్నారు. చామంతి, రోజా, సంపంగి, గన్నేరు, నూరు వరహాలు, మల్లెలు, మొల్లలు, సెంటు జాజులు, కనకాంబరాలు, తామరపూలు, కలువపూలు, మాను సంపం గి,నందివర్ధనం, సెంటుజాజులు, మొగిలిపూలు తదితర పుష్పాలు మొగిలిరేకులు, మొరవం, దవనం, మారేడుదళం, పన్నీరుఆకు, కదిరికజ్జాతదితర పత్రాలతో సప్తగిరివాసుడిని వేదోక్తంగా అర్చించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి పుష్పం స్వామి సేవకే.. తిరుమల పుష్పించే ప్రతి పుష్పం స్వామివారికే. ఇది తిరుమల క్షేత్రం సంప్రదాయం. స్వామి సేవలకు అవసరమయ్యే పుష్పాల కోసం 9వ శతాబ్దంలో అనంతాళ్వార్ అనేభక్తుడు ఆలయం వెనుకభాగంలో పూతోటను ఏర్పాటు చేశాడు. తోటలో పుష్పించిన పుష్పాలతో స్వామివారిని పూజించేవారు. ఆయన తదనంతరం ఆయన వారసులు ఈ సంప్రదాయాన్ని పాటించారు. 1996లో టీటీడీలో మీరాశీ వ్యవస్థను రద్దు చేశాక టీటీడీ ఆధీనంలోనే పూతోటను నెలకొల్పారు. శ్రీవారికి అవసరమైన పుష్పాలను సేకరించే బాధ్యతను టీటీడీ ఉద్యానవన శాఖకు అప్పగించింది. సుమారు వంద ఎకరాల్లో ఉద్యానవనశాఖ పూతోటను నిర్వహిస్తోంది. ఇక్కడి పుష్పాలను స్వామివారి సేవకు వినియోగిస్తున్నారు. వీటితోపాటు దాతలు స్వామివారి సేవకోసం పుష్పాలను వితరణగా అందిస్తుంటారు. తమిళనాడులోని సేలం, శ్రీరంగం, కుంభకోణం, చెన్నై, కర్ణాటకలోని కరూర్తోపాటు మనరాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి టన్నుల కొద్దీ పుష్పాలు తిరుమలకు చేరుతుంటాయి. -
వైభవంగా శ్రీవారి పుష్పయాగం
తిరుమల: తిరుమల శ్రీవారి పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు 7 టన్నుల పుష్పాలు విరాళంగా సమర్పించారు. తమిళనాడు నుంచి 3 టన్నులు, కర్ణాటక నుంచి 3 టన్నులు, ఏపీ, తెలంగాణ నుంచి మరో టన్ను పుష్పాలు అందాయి. వాటిలో ఆరు రకాల పత్రాలు, 12 రకాల పుష్పాలు ఉన్నాయి. పుష్పయాగం సందర్భంగా అర్జిత సేవలు రద్దు చేశారు. -
వైభవంగా పుష్పయాగం
వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 14 నుంచి 24 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ సారి భక్తులు విరివిగానే విచ్చేశారు. శ్రీ సిద్దేశ్వరస్వామి, చెన్నకేశవస్వామికి ఆదివారం ఉదయం స్నపన తిరుమంజనం, హోమం, రాత్రి పుష్పయాగం నిర్వహించారు. – తాళ్లపాక (రాజంపేట) -
రేపు అప్పలాయగుంటలో పుష్పయాగం
రేపు అప్పలాయగుంటలో పుష్పయాగం తిరుపతి అర్బన్: వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అందుకోసం బుధవారం ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6:30 గంటలకు సేనాపతి ఉత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, అనంతరం 11:30 గంటల వరకు శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పలురకాల పుష్పాలతో అలంకరించనున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించిన పూజలు, కైంకర్యాలు, గత నెలలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. -
వైభవంగా పుష్పయాగం
60 రకాల సుగంధ పుష్పాలతో యాగం తల్లాడ (ఖమ్మం) : ఖమ్మం జిల్లా తల్లాడలో హనుమత్ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయంలో మంగళవారం పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 60 రకాల సుగంధ పుష్పాలతో, ఆరు రకాల పత్రిని సేకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లాడ రెడ్డి సంఘం ద్రవ్య సహాయంతో ఈ యాగం జరిగింది. దేశం సుభిక్షంగా, శాంతియుతంగా, సస్య శ్యామలంగా వర్ధిల్లాలని కోరుతూ యాగం నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ప్రధాన అర్చకులు దివి సీతారామాచార్యులు, దివి రామాచార్యులు, వేణుగోపాలచార్యులు, ఆగమవేత్త పరాంకుశం విఖనసాచార్యులు, బాలకృష్ణమాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రోచ్ఛరణల మధ్య యాగం పూర్తయింది. ఈ యాగానికి పెద్ద సంఖ్యలో మహిళలు పుష్పాలతో తరలి వచ్చారు. యాగానికి ముందు తల్లాడ పుర వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం శేషగిరిరావు, దగ్గుల కృష్ణారెడ్డి, అనుమోలు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
పురుషోత్తముడికి పుష్పవైభోగం
-
18న శ్రీవారి పుష్పయాగం
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి ఈనెల 18వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు. ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కార్తీకమాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున యాగం నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. తామర, మల్లె, చామంతి, సంపంగి, రోజా, మరువం, దవనం, తులసి, గన్నేరు, నందివర్థనం వంటి 20 రకాలకు పైగా సంప్రదాయ పుష్పాలతో స్వామివారికి నివేదన చేస్తారు. తాయార్లు, మలయప్ప సమక్షంలో అగ్నిప్రతిష్ట చేసి బిల్వ పత్రాలతో 108 సార్లు హోమం నిర్వహిస్తారు. పుష్పాధిపతిని ఆవాహనం చేసి 12 పర్యాయాలు వైష్ణవాంతంగా యాగం పూర్తి చేసి ఉత్సవర్లకు తిరుమంజనం, అభిషేకం, నైవేద్య, హారతులు ఇవ్వనున్నారు.