వైభవంగా పుష్పయాగం | pushpayagam in tallada venkateswara temple | Sakshi
Sakshi News home page

వైభవంగా పుష్పయాగం

Published Tue, Dec 22 2015 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

వైభవంగా పుష్పయాగం

వైభవంగా పుష్పయాగం

60 రకాల సుగంధ పుష్పాలతో యాగం
తల్లాడ (ఖమ్మం) : ఖమ్మం జిల్లా తల్లాడలో హనుమత్ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయంలో మంగళవారం పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 60 రకాల సుగంధ పుష్పాలతో, ఆరు రకాల పత్రిని సేకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లాడ రెడ్డి సంఘం ద్రవ్య సహాయంతో ఈ యాగం జరిగింది. దేశం సుభిక్షంగా, శాంతియుతంగా, సస్య శ్యామలంగా వర్ధిల్లాలని కోరుతూ యాగం నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.

ప్రధాన అర్చకులు దివి సీతారామాచార్యులు, దివి రామాచార్యులు, వేణుగోపాలచార్యులు, ఆగమవేత్త పరాంకుశం విఖనసాచార్యులు, బాలకృష్ణమాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రోచ్ఛరణల మధ్య యాగం పూర్తయింది. ఈ యాగానికి పెద్ద సంఖ్యలో మహిళలు పుష్పాలతో తరలి వచ్చారు. యాగానికి ముందు తల్లాడ పుర వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం శేషగిరిరావు, దగ్గుల కృష్ణారెడ్డి, అనుమోలు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement