venkateswara temple
-
పిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు: టీటీడీ ఈవో
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత కోసం ఘాట్ రోడ్ల ప్రయాణంలో ప్రమాదాల నివారణకు దీర్ఘ కాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా అధికారులు, ఉద్యోగులందరు సుందర తిరుమల-శుద్ధ తిరుమల పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయి. 'ఇందుకోసం జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. సుప్రభాత సేవ విచక్షణ కోటా రద్దు చేశాం. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. టీటీడీ సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు, ఇతర విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు చక్కటి సేవలు అందిస్తున్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. 'తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. తద్వారా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాము. టీటీడీ చరిత్రలో తొలిసారి టీటీడీ లోని అన్ని విభాగాల ఆధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా నెల రోజుల పాటు సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజుల్లో 15,441 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 13,351 మంది కార్పొరేషన్ సిబ్బంది, 6 వేల మందికి పైగా శ్రీవారి సేవకులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్, పోలీస్, న్యాయశాఖ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలు, రెండు ఘాట్ రోడ్లు, రెండు నడక దార్లలో పారిశుద్ధ్య విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మే 13వ తేదీన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణగారు సైతం తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు' అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదీ చదవండి:అధైర్యపడొద్దు..అండగా ఉంటాం 'తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండీషన్ బాగా లేనందు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశాము. ట్యాక్సీ డ్రైవర్లు, వాహనదార్లు డ్రైవింగ్ చేసే సమయంలో టీటీడీ నిర్ణయించిన వేగం మేరకే నిదానంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడకుండా, మలుపుల వద్ద పరిమిత వేగంతో , ఓవర్ టేక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి' అని ఈవో ధర్మారెడ్డి కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి టీటీడీకి కేటాయించింది. ఈ భూమిలో దాత, రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల వ్యయంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించనున్నారు. జూన్ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు భక్తులు పాల్గొంటారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మే 31వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది. సనాతన హైందవ ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది. ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జమ్మూలోని మజీన్ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమిలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 3 నుండి 8వ తేదీ వరకు టీటీడీ నిర్వహిస్తోంది. 8వ తేదీ జరిగే మహాసంప్రోక్షణలో జమ్ముకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదీ చదవండి:శరవేగంగా చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం శ్రీ పద్మావతి హృదయాలయంలో 20నెలల వ్యవధిలోనే 1450 మంది చిన్నారులకు ఉచితంగా గుండె అపరేషన్లు నిర్వహించారు . క్లిష్టమైన గుండె అపరేషన్లు కూడా ఆరోగ్య శ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ స్కీంల కింద, ప్రాణదానం ట్రస్టు సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. మూడు గుండెమార్పిడి ఆపరేషన్లు కూడా విజయవంతంగా నిర్వహించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 'టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంత మంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద ఐటి విభాగం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిరుద్యోగులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోస పోవద్దు' అని ఈవో ధర్మారెడ్డి భక్తులను కోరారు. మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 23.38 లక్షలుకాగా, హుండీ కానుకలు రూ.109.99 కోట్లు ఆదాయం లభించింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ఒక కోటి 6 లక్షలు కాగా, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 56.30 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11 లక్షలు. ఇదీ చదవండి:మేనిఫెస్టో చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే కాగితం: కొమ్మినేని -
కుషాయిగూడలో వెంకటేశ్వర ఆలయంలో దారుణం
-
‘పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణ’
సాక్షి, చెన్నై : తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద ట్రస్ట్ సహకారంతో ఇక మీదట పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైవీ దంపతులు బుధవారం కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా కన్యాకుమారిలో ధార్మిక కార్యక్రమాలకు అవరోధం ఏర్పడిందన్నారు. వివేకానంద ట్రస్ట్ టీటీడీకి చట్ట పరంగా భూమి అప్పగిస్తే కళ్యాణ మండపం నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. భక్తుల కోరిక మేరకు కన్యాకుమారి ఆలయం ఆవరణంలో గరుడాళ్వార్ విగ్రహం ఏర్పాటు చేసే విషయం ఆగమ పండితులతో మాట్లాడి, రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముగిశాక తిరుమలకు గతంలో సాధారణ రోజుల్లో ఎంత సంఖ్యలో భక్తులను అనుమతించేవారో అంత సంఖ్య పెంచుతామని చైర్మన్ తెలిపారు. ఆలయానికి రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. టీటీడీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి, డాక్టర్ నిశ్చిత అధికారులు పాల్గొన్నారు. -
హుండీ లెక్కింపు అంటేనే హడల్
టీటీడీ అధికారులకు పరకామణి సమస్య తలనొప్పి తెచ్చిపెడుతోంది. టీటీడీ ఉద్యోగులు పరకామణి విధులంటేనే హడలిపోతున్నారు.ç ³పరకామణి మండపంలో సౌకర్యాలు లేకపోవడంతో ఎవరూ కూడా పరకామణి విధులకు రావడానికి సాహసించడం లేదు. నిల్వలు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాక్షి, తిరుమల : టీటీడీకి ప్రధాన ఆదాయ వనరులు భక్తులు సమర్పించే హుండీ కానుకలు, వాటి లెక్కింపు కోసం టీటీడీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయంలోనే పరకామణి మండపంలో నిత్యం స్వామివారి హుండీ కానుకలును లెక్కిస్తారు. కాని టీటీడీ అనాలోచిత నిర్ణయాలతో స్వామివారి కానుకలు లెక్కించడానికి ఇప్పుడు సిబ్బంది కొరత ఉత్పన్నమైంది. దీంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా వడ్డీ రూపేణా రావాల్సిన ఆదాయాన్ని టీటీడీ కోల్పోతోంది. శ్రీవారిని దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరగుతూ ఉండడంతో కానుకల సమర్పణ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి రోజూ 8 నుంచి 16 సార్లు హుండీ నిండిపోతోంది. ఈ కానుకలను ఎప్పటికప్పుడు లెక్కించేందుకు టీటీడీ ప్రత్యేకంగా పరకామణి వ్యవస్థను ఏర్పాటుచేసింది. మొదట్లో టీటీడీ ఉద్యోగులను పరకామణి విధుల కోసం ప్రతి నిత్యం డెప్యుటేషన్‌పై టీటీడీ నియమించేది. స్వామివారికి లభిస్తున్న కానుకలు పెరుగుతుండడంతో ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగుల సహకారం కూడా టీటీడీ తీసుకుంది. డిపాజిట్ల వ్యవహారంలో టీటీడీకి, బ్యాంకుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో పరకామణి విధుల నుంచి బ్యాంకు సిబ్బంది 2009 నుంచి దూరమయ్యారు. దీంతో టీటీడీ ఉద్యోగులే శ్రీవారి కానుకలను లెక్కిస్తున్నారు.2009 తరువాత పరకామణిలో టీటీడీ మార్పులు తీసుకువచ్చింది. స్వామివారికి కానుకులు నిత్యం రూ.3 కోట్లు దాటుతుండడంతో పాటు ప్రతి నెల లభించే బంగారు ఆభరణాలు 100 కేజీలు దాటుతుండడం, చిల్లర నాణేలు రోజూ రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు వçస్తుండడంతో, చిల్లర పరకామణిని తిరుపతిలోని పరిపాలన భవనానికి టీటీడీ తరలించింది. శ్రీవారి ఆలయంలోని రెండు మండపాల్లో కరెన్సీ, బంగారు లెక్కింపునకు శ్రీకారం చుట్టింది. టీటీడీ ఉద్యోగులకు సహాయకులుగా పరకామణి సేవకులను టీటీడీ ప్రవేశపెట్టింది. గత ఏడాది మహాసంప్రోక్షణ సమయంలో ఆనంద నిలయానికి పక్కన ఉన్న మండపాన్ని యాగశాలగా మార్చివేసిన టీటీడీ కరెన్సీ లెక్కింపు కోసం ఆలయం వెనుక వున్న ఒక్క మండపాన్ని మాత్రమే వినియోగించుకుంటోంది. సంప్రోక్షణ పూర్తి అయినా మండపంలో తిరిగి పరకామణి లెక్కింపు టీటీడీ చేపట్టలేదు. పూర్తిగా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండే పరకామణి మండపంలోకి పరిమితికి మించి ఉండడంతో ఉద్యోగులు శ్వాస కూడా తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో లెక్కింపు ప్రకియ మందగించింది. దీంతో నిల్వలు పెరిగిపోయాయి. దీంతో లెక్కింపును వేగవంతం చేసేందుకు íసి–షిఫ్ట్‌ను టీటీడీ ఏర్పాటు చేసింది. అయితే సిబ్బంది కొరత కారణంగా ఈ షిఫ్ట్‌ను అమలు చేయలేని స్థితిలో టీటీడీ ఉంది. ఫలితంగా ఇబ్బందులు పడుతోంది. టీటీడీ ఉద్యోగులు పరకామణి విధులంటేనే హడలిపోతున్నారు. పరకామణి మండపంలో విపరీతమైన దుమ్ము ధూళి నిండిపోవడం, తాగడానికి కనీసం నీటి సౌకర్యం కూడా లేకపోవడం, ఒకసారి పరకామణి మండపంలోకి వెళితే 3 గంటల పాటు వెలుపలికి వచ్చే అవకాశం లేదు. దీంతో ఎవరూ కూడా పరకామణి విధులకు రావడానికి సాహసించడం లేదు. దీంతో తాజాగా టీటీడీ కానుకల లెక్కింపును విద్యార్థులతో చేయిస్తే ఎలా ఉంటుందో అనే కసరత్తు చేస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే టీటీడీ అధికారులు సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ అసలు సమస్యను సరిచేయకుండా ఇలా రోజుకు ఒకరు అన్న చందాన టీటీడీ లెక్కింపును చేపట్ట్లాని భావిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎవరు వచ్చినా.. ఎప్పుడు వచ్చినా... పరకామణి మండపంలో పని చేయడానికి అనువైన వాతావరణం లేకపోతే... భవిష్యత్తులో కానుకల లెక్కింపుకు టీటీడీ యంత్రాల పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుందేమో..! -
19 సంవత్సరాలుగా జీవచ్ఛవాలుగా....
సాక్షి, కడప కల్చరల్ : కడప రాయుని సన్నిధిలో పని చేస్తున్న పదకొండు మంది చిరుద్యోగులు చాలీ చాలని జీతంతో బతుకులీడుస్తున్నారు. ఒకటి రెండు కాదు 19 ఏళ్లుగా నెలకు రూ. 5010ల జీతంతోనే జీవితం కొనసాగిస్తున్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానాల పరిధిలోకి వెళ్లినా ఫలితం లేక.. ఆ నిత్య దైవ సేవకులు కఠిన పేదరికంతో ‘ఏ దేవుడైనా కరుణించకపోతాడా!’ అన్న ఆశతో జీవచ్ఛవాలుగా కాలం గడుపుతున్నారు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం 2006లో టీటీడీలో విలీనమైంది. ఆ నిర్ణయం ఆలయంలో పనిచేస్తున్న దిగువ స్థాయి ఉద్యోగులకు శాపంగా మారింది. 19 సంవత్సరాలుగా కేవలం రూ. 5 వేల జీతంతో కుటుంబా లను పోషించుకోలేక ఒక ఉద్యోగి ఆకలి చావుకు గురికాగా, ఇంకొకరికి మతి చలించింది. మరొకరు ఎటు వెళ్లిపోయారో తెలియదు. ఒక ఉద్యోగికి జబ్బు చేసి చికిత్స పొందే ఆర్థికస్థితి లేక మరణించారు. వీరి కుటుంబాలన్నీ ప్రస్తుతం రోడ్డున పడ్డాయి. ఎప్పుడైనా తమకు మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో ఈ ఆలయానికి చెందిన 11 మంది చిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కోర్టు సూచించినా.... తమకు టీటీడీ టైం స్కేల్ ఇవ్వాలని కోరుతూ ఈ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లగా వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా సంబంధిత ఏ అధికారి ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలో ఇలాంటి విలీన ఆలయాల్లోనే మిగతా అందరూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చిన టీటీడీ తమను మాత్రం ఉపేక్షించడం ఎందుకో తెలియదని వాపోతున్నారు. తమ బ్యాచ్‌కు చెందిన దేవదాయశాఖ ఉద్యోగులు ప్రస్తుతం మంచి హోదాలో రూ. 60 వేలకు పైగా జీతాలు తీసుకుంటూ ఉండగా...నిత్యం స్వామి, అమ్మవార్ల ఆరాధనలో గడుపుతున్న తాము మాత్రం ఉండీ లేని ఉద్యోగాలతో...కేవలం రూ. 5 వేలతో కుటుంబాలను లాక్కురాక చస్తూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే దిక్కు అడిగిన వారిని, అడగని వారిని కూడా అర్హతను బట్టి మంచి జీతాలు ఇచ్చి కొత్త ఉత్సాహం ఇస్తున్న కడప వాసి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే తమ కష్టాలను తొలగిస్తారని ఆశిస్తున్నట్లు దేవునికడప ఆలయ చిరుద్యోగులు తెలుపుతున్నారు. తమ ఆకలి బాధలను ఆయన తప్పక అర్థం చేసుకుని ఆదుకుంటారన్న నమ్మకం ఉందంటున్నారు. ఇన్నేళ్లు దైవ సేవలో గడిపిన తమను ఆదుకునేందుకు దేవుడే ఆయనను పంపినట్లు ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఇలా జరిగింది... దేవునికడప ఆలయం దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉండేది. 2006లో టీటీడీ పరిధిలోకి వెళ్లింది. తమ జీవితాలు మరింత బాగుపడతాయని ఆలయ చిరుద్యోగులు సంతోషించారు. కానీ వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా టీటీడీ గుర్తించలేదు. టైం స్కేల్ ఇవ్వలేదు. సొసైటీగా ఏర్పడితే ఔట్సోర్సింగ్ కింద గుర్తిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటినుంచి ప్రతి సంవత్సరం ఉద్యోగాలను రెన్యూవల్ చేయించుకుంటూ నెలకు రూ. 5010 జీతంతో గడుపుతున్నారు. దేవునికడప ఆలయానికి సంబంధించి మొత్తం 11 మంది చిరుద్యోగులు ఉన్నారు. వారిలో పి.కృష్ణమూర్తి సీనియర్ అర్చకులు. తమను టీటీడీ ఉద్యోగులుగా గుర్తించాలని పలుమార్లు తిరుపతికి వెళ్లి అధికారులందరికీ మొర పెట్టుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకూ అర్జీలు ఇచ్చారు. జిల్లావాసి టీటీడీ చైర్మన్ అయినా ఫలితం లేకపోయింది. ఏ దేవుడూ వారిని కరుణించలేదు. ప్రస్తుతం తమ ఆశలన్నీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. -
నమో వేంకటేశా..
కామారెడ్డి రూరల్ : మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వరకు సుబ్రహ్మణ్య శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవతామూర్తులప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 30న ఉదయం 7:30కు ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 1న శిఖర ప్రతిష్ఠ, ధాన్యాది, శయ్యాది, పుష్పాది, ఫలాధివాసముులు, హోమం, 2న అవాహిత దేవతా పూజలు, బలిప్రదానం, గర్త సంస్కారము కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. అనుగ్రహ భాషణం ప్రతిష్ఠాపనోత్సవాల్లో తోగుట రామాపూరం శ్రీ మధనానంద పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ మధవానంద సరస్వతీతో యంత్ర ప్రాణ ప్రతిష్ఠా కళాన్యాసము, మహాభిషేకం, కుంభాభిషేకం, స్వామీజీ అనుగ్రహాభాషనం ఉంటాయ తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు అన్నదానం, సాయంత్రం సాయంత్రం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు పూలు, పండ్లు, పూజ సామగ్రి నవధాన్యాలు, పగడాలు, ముత్యాలు, నవరత్నాలు, యంత్రం కింద వేయడానికి తీసుకురావచ్చన్నారు. 2న దేవదాయశాఖ మంత్రి రాక విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగం గా ఏప్రిల్ 2న నిర్వహించనున్న కార్యక్రమాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు హాజరవుతారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ విశిష్టత లింగాపూర్ గ్రామంలోగల శ్రీవేంకటేశ్వర పురాతన ఆలయం భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే వెంకన్నగా పేరుంది. కాల క్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలతిరుపతి దేవస్థానం నిత్య ధూపదీప నైవెద్య పథకం కింద సహాయం అందించింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ సర్వశ్రేయో నిధి (సీజీఎఫ్) కింద రూ.30 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేసింది. టీటీడీ దేవతామూర్తుల విగ్రహాలను అందించింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఐక్యంగా ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చి సుమారు రూ.కోటి వ్యయంతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. -
తిరుమలలో భక్తుల రద్దీ
-
కమనీయం..ఆనంద నిలయం
-
శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వీఐపీ దర్శన సమయంలో స్వామివారి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో పండితులు వారికి ఆశీర్వాదం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. -
వేంకటేశ్వరాలయం హుండీ లెక్కింపు
అనంతపురం కల్చరల్ : హౌసింగ్‌బోర్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం హుండీని మంగళవారం సాయంత్రం లెక్కించారు. రూ.1,24,835 ఆదాయం వచ్చినట్టు నిర్వాహకులు క్రిష్ణమూర్తి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి హుండీ ఆదాయం పెరగడం ఆనందంగా ఉందన్నారు. -
ఘనంగా శ్రీవారి దీపావళి ఆస్థానం
హైదరాబాద్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి ఆస్థానంను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది దీపావళి (అమావాస్య) రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన చేశారు. అనంతరం బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేశారు. ఆస్థానంను పురస్కరించుకుని పలు అర్జిత సేవలు రద్దు చేశారు. -
దేవుడి సొత్తు వదలని దొంగలు
-
పండుగ వేళల్లో రెచ్చిపోతున్న దొంగలు
-
ఉచితం.. వివాదం
ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి జిల్లా): ద్వారకాతిరుమల క్షేత్రంలో తిరుగుతున్న దేవస్థానం ఉచిత బస్సుల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ పలువురు వ్యాపారులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆలయం వద్ద ఉచిత బస్సులను అడ్డుకున్నారు. అధికారులు నిర్ణయం మార్చుకునే వరకు బస్సులకు అడ్డుతప్పుకునేది లేదంటూ నిరసనకు దిగారు. దీంతో క్షేత్రానికి వచ్చిన పలువురు భక్తులు ఇబ్బంది పడ్డారు. క్షేత్రానికి చేరుకునే యాత్రికులను స్థానిక గరుడాళ్వార్ సెంటర్ నుంచి ఉచిత బస్సుల ద్వారా దేవస్థానం అధికారులు కొండపైకి చేర్చేవారు. ఇలా చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ కొండ కింద వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం దేవస్థానం బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆలయ అధికారులకు స్థానిక పంచాయతీ లిఖితపూర్వకంగా తెలియజేసింది. దీంతో యాత్రికులకు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో బస్సు సర్వీసులను క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆల యం వద్ద నుంచి కొండపైకి నడపడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, కొండ దిగువ వ్యాపారులు కలసి కుంకుళ్లమ్మ ఆలయం వద్దకు చేరుకుని ఉచిత బస్సులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు సంఘటనా స్థలానికి ఏఈ పి.ప్రసాద్, రొంపిచర్ల హనుమంతాచార్యులను పంపగా వారు మల్లిపెద్దితో చర్చించారు. బస్టాండ్ నుంచి అయితే అభ్యంతరం లేదు స్థానిక గరుడాళ్వార్ సెంటర్ నుంచి కొండపైకి బస్సులు తిప్పడం వల్ల కొండ దిగువ వ్యాపారులు నష్టపోతున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు చెప్పి బస్సులను నడపడం ఆపిస్తే.. మళ్లీ ఇక్కడి నుంచి వాటిని నడపడం ఏంటని మల్లిపెద్ది ఆలయ అధికారులను ప్రశ్నించారు. ఇలా నడుపుతున్నట్టు తమకు తెలియజేయలేదన్నారు. ఉచిత బస్సులను కొత్త బస్టాండ్ నుంచి గాని, దేవస్థానం ఆర్చిగేటు వద్ద నుంచి గాని నడిపితే తమకెలాంటి అభ్యంతరం ఉండదన్నారు. వ్యక్తిగత కక్షలతో వ్యాపారులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. అధికారుల ఆదేశానుసారం బస్సుల్లో భక్తులను కొండపైకి చేర్చుతున్నామని, సమస్య పునరావృతం కాకుండా చూస్తామని ఏఈ అన్నారు. భక్తుల సౌకర్యార్థమే బస్సులు దూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా ఉచిత బస్సు సర్వీసులను నడుపుతున్నామని, అయితే ఇలా అడ్డుకోవడం వల్ల యాత్రికులు ఇబ్బంది పడుతున్నారని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు. విషయాన్ని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నేత్రపర్వం
అనంతపురం కల్చరల్ : ఆషాఢమాసం చివరి శనివారం సందర్భంగా స్థానిక ఆర్ఎఫ్ రోడ్‌లోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల వ్రతం కనుల పండువగా జరిగింది. శనివారం మహిళా భక్తులు ఏకరూప వస్త్రధారణతో వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏఎల్ఎన్ శాస్త్రి, హరికిశోర్ శర్మ నేతృత్వంలో భక్తుల గోవింద నామస్మరణతో ఆప్రాంతం మార్మోగింది. భక్తులు బారులుదీరి వేంకటేశ్వర స్వామి ప్రతిమకు ప్రత్యేక పసుపు, కుంకుమలతో, పవిత్ర జలాలు, పుష్పాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఆలయంలోని శ్రీ లక్ష్మీ సహిత శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రత్యేక అలంకరించారు. సుప్రభాత సేవ, అభిషేకాలు, తిరుమంజనం,తోమాల సేవ. కుంకుమార్చన. తీర్థప్రసాద వినియోగం జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మార్మోగిన గోవింద నామస్మరణ
అనంతపురం కల్చరల్ : లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఏడు శనివారాల వ్రతాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో శనివారం స్థానిక ఆర్ఎఫ్ రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయ అర్చకులు ఏఎల్ఎన్ శాస్త్రి, హరికిషోర్ శర్మ నేతత్వంలో వందలాది మహిళలు సామూహిక వ్రతమాచరించారు. ఏకరూప వస్త్రధారణతో బారులు తీరి కూర్చున్న మహిళలు తమ ముందు ఏర్పాటు చేసుకున్న వెంకటేశ్వర స్వామి ప్రతిమకు పసుపు, కుంకమలతో, పవిత్ర జలాలతో, పుష్పాలతో పూజలు చేశారు. అనంతర ం అర్చకులు ఏడు శనివారాల వ్రత విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి, కొండయ్య, నాగరాజు, ఫెక్ల్స్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
బంజారాహిల్స్‌లో రూ. 18కోట్లతో వెంకన్న ఆలయం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో రూ. 18 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో కొత్త ముత్యపు పందిరి, సర్వభూపాల వాహనం తయారీకి రూ. 3.86 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. అర్చకుల సంక్షేమ నిధికి రూ. 25 కోట్లు మంజూరు చేశారు. స్వామివారి శఠగోపాల తయారీకి రూ. 72 లక్షలు కేటాయించారు. కెన్యా రాజధాని నైరోబీలో మే 22న వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఆలయంలో కొత్త కళ్యాణమండపం నిర్మిస్తారు. యాత్రకుల ఉచిత సముదాయానికి రూ. 4.6 కోట్లు కేటాయించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు రూ. 50 లక్షలు మంజూరుచేశారు. తిరుమల వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం, కొత్త వంటపాత్రల కొనుగోలుకు రూ. 30 లక్షలు మంజూరు చేశారు. -
శ్రీవారి ఆలయ సమీపం నుంచి వెళ్లిన విమానం
తిరుమలలో మంగళవారం శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో విమానం ప్రయాణించింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో తూర్పు దిశ నుంచి పశ్చిమ దిశవైపు ఆ విమానం వెళ్లింది. భద్రతా కారణాల వల్ల తిరుమల ఆలయంపై విమాన ప్రయాణాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. తరచూ విమానాలు ఆలయానికి అతి సమీపంలోనే ప్రయాణిస్తుండటంతో టీటీడీ భద్రతాధికారులతో పాటు భక్తుల్లో ఆందోళన నెలకొంది. -
వైభవంగా పుష్పయాగం
60 రకాల సుగంధ పుష్పాలతో యాగం తల్లాడ (ఖమ్మం) : ఖమ్మం జిల్లా తల్లాడలో హనుమత్ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయంలో మంగళవారం పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 60 రకాల సుగంధ పుష్పాలతో, ఆరు రకాల పత్రిని సేకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లాడ రెడ్డి సంఘం ద్రవ్య సహాయంతో ఈ యాగం జరిగింది. దేశం సుభిక్షంగా, శాంతియుతంగా, సస్య శ్యామలంగా వర్ధిల్లాలని కోరుతూ యాగం నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ప్రధాన అర్చకులు దివి సీతారామాచార్యులు, దివి రామాచార్యులు, వేణుగోపాలచార్యులు, ఆగమవేత్త పరాంకుశం విఖనసాచార్యులు, బాలకృష్ణమాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రోచ్ఛరణల మధ్య యాగం పూర్తయింది. ఈ యాగానికి పెద్ద సంఖ్యలో మహిళలు పుష్పాలతో తరలి వచ్చారు. యాగానికి ముందు తల్లాడ పుర వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం శేషగిరిరావు, దగ్గుల కృష్ణారెడ్డి, అనుమోలు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
11న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
సాక్షి, తిరుమల: ఈనెల 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి (అమావాస్య) రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేస్తారు. -
బిక్నూరు వెంకటేశ్వర ఆలయానికి పోచారం
బిక్నూరు : నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఆలయాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఆయనతో పాటు హార్టీకల్చర్ రాష్ట్ర కమిషనర్ వెంకట రామిరెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం.. గుట్ట చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, పచ్చదనం గురించి కమిషనర్‌కు వివరించారు. -
తిరుమలలో నీటి సమస్య తీవ్రతరం!
తిరుమల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, బోర్లు ఎండిపోవడంతో నీటి సమస్య తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. తాజా నీటి సమస్య ఆలయ అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ప్రతి రోజు సుమారు 70 వేలకు పైగా భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని.. వారి అవసరాలకు దాదాపు 40 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుందని అధికారులు తెలిపారు. పాపనాశనం, గోగర్భం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ లో నీటి నిలువల స్థాయి పడిపోవడంతో అధికారులకు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు. అధికారుల సమాచారం ప్రకారం పాపనాశనంలో 412 లక్షల గ్యాలన్లు, గోగర్భం డ్యామ్ లో 55 లక్షలు, కుమారధార డ్యామ్ లో 1075 గ్యాలన్లు, పసుపుధార డ్యామ్ లో 32 లక్షల గ్యాలన్లు మేరకు నీటి నిల్వలున్నాయని.. మొత్తం 1574 లక్షల గ్యాలన్ల నీరు రిజర్వాయర్లలో అందుబాటులో ఉందని.. ఒకవేళ వర్షాలు కురవకపోతే.. మరో 48 రోజులపాటు నీటిని అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. -
విన్నపాలు వినవలె..
భీమవరం కల్చరల్ :జిల్లాలోని ఆలయాలను భక్తి భావం ఉట్టి పడేలా తీర్చిదిద్దాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పైడికొండల మాణిక్యాలరావుకు భక్తులు చేసుకుంటున్న విన్నపాలు ఇవి.జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. వాటికి సంబంధించి కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి.పురాతన ఆలయాలు, జీర్ణావస్థకు చేరిన ఆలయాల మరమ్మతులకు జిల్లాకు రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం అంచనాల దశలోనే అవి ఉన్నాయి. పనులు వేగవంతం చేయాల్సిన అవసరముంది.జిల్లాలో ప్రధానమైన ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. భక్తులు వేచియుండేందుకు అదనంగా గదుల నిర్మాణం, సత్రాల నిర్మాణాలను చేపట్టాలి. ప్రముఖమైన పలు ఆలయాలకు స్థలాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అక్కడ అన్నసమారాధనలు చేసేందుకు, విశ్రాంతికి గదులు, వివాహాలకు కావలసిన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఆలయాలను గుర్తించి ప్రభుత్వ స్థలాలను వాటికి కేటాయించేలా చూడాలి.కొన్ని ఆలయాలకు వాస్తు దోషాలు ఉన్నట్టు గుర్తించారు. దేవాదాయ శాఖ స్తపతులతో వాస్తు మార్పులను చేపట్టాలి. స్తపతులతో సంప్రదించకుండానే చాలా ఆలయాల్లో వాస్తు మార్పులు చేస్తున్నారు. వాటిని గుర్తించి సరిచేయాలి.ఆలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆ ఖాళీలను భర్తీ చేయాలి.ఉద్యోగుల సమస్యలుదేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 60 ఏళ్లు వర్తించేయాలి. టెంపుల్ ఉద్యోగులకు సంబంధించి సం బంధిత ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని వారి జీతాలకు కేటాయిస్తున్నారు. అలా కాకుండా జిల్లాలో అన్ని దేవాలయాలకు ఒక కామన్ ఫండ్‌ను ఏర్పాటు చేసి జీతాలు ఇస్తే వారి ఇబ్బందులు తొలగుతాయి.ఉద్యోగులకు సక్రమంగా ప్రమోషన్లు రావాలంటే జీవో 888లోని రూల్ 33 ను తొలగించాలి. అప్పుడే సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు దక్కుతాయి. మాతృ సంస్థతో సంబంధం లేకుండా 2010 పీఆర్సీనీ, ఇతర బెనిఫిట్స్‌ను అమలు చేయాలి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, అర్చ క, ఇతర సిబ్బందికి సంక్షేమ నిధి నుంచి ఇచ్చే గ్రాట్యుటీ రూ.2 లక్షలకు జీతం సీలింగ్‌గా పెట్టిన రూ.12,500 తొలగించి, గ్రాట్యుటీ రూ.5 లక్షలకు పెంచాలి. సిబ్బందికి 65ఎ ఫండ్ ద్వారా జీతాల ఇచ్చేలా సవరణ చేయించాలి. -
రేపు పుప్పాలగూడలో శ్రీనివాస కల్యాణం
హైదరాబాద్: పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీలో వెలసిన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీపద్మావతి అలివేలుమంగా సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్య ఆచార్యుల నిర్దేశంతో శృంగేరి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా సేవా సమితి అధ్యక్షుడు వంగల కేశవ భట్ కోరారు.