
బిక్నూరు వెంకటేశ్వర ఆలయానికి పోచారం
బిక్నూరు : నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఆలయాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఆయనతో పాటు హార్టీకల్చర్ రాష్ట్ర కమిషనర్ వెంకట రామిరెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం.. గుట్ట చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, పచ్చదనం గురించి కమిషనర్‌కు వివరించారు.