విన్నపాలు వినవలె..
భీమవరం కల్చరల్ :జిల్లాలోని ఆలయాలను భక్తి భావం ఉట్టి పడేలా తీర్చిదిద్దాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పైడికొండల మాణిక్యాలరావుకు భక్తులు చేసుకుంటున్న విన్నపాలు ఇవి.జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. వాటికి సంబంధించి కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి.పురాతన ఆలయాలు, జీర్ణావస్థకు చేరిన ఆలయాల మరమ్మతులకు జిల్లాకు రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం అంచనాల దశలోనే అవి ఉన్నాయి. పనులు వేగవంతం చేయాల్సిన అవసరముంది.జిల్లాలో ప్రధానమైన ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. భక్తులు వేచియుండేందుకు అదనంగా గదుల నిర్మాణం, సత్రాల నిర్మాణాలను చేపట్టాలి.
ప్రముఖమైన పలు ఆలయాలకు స్థలాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అక్కడ అన్నసమారాధనలు చేసేందుకు, విశ్రాంతికి గదులు, వివాహాలకు కావలసిన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఆలయాలను గుర్తించి ప్రభుత్వ స్థలాలను వాటికి కేటాయించేలా చూడాలి.కొన్ని ఆలయాలకు వాస్తు దోషాలు ఉన్నట్టు గుర్తించారు. దేవాదాయ శాఖ స్తపతులతో వాస్తు మార్పులను చేపట్టాలి. స్తపతులతో సంప్రదించకుండానే చాలా ఆలయాల్లో వాస్తు మార్పులు చేస్తున్నారు. వాటిని గుర్తించి సరిచేయాలి.ఆలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆ ఖాళీలను భర్తీ చేయాలి.ఉద్యోగుల సమస్యలుదేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 60 ఏళ్లు వర్తించేయాలి.
టెంపుల్ ఉద్యోగులకు సంబంధించి సం బంధిత ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని వారి జీతాలకు కేటాయిస్తున్నారు. అలా కాకుండా జిల్లాలో అన్ని దేవాలయాలకు ఒక కామన్ ఫండ్‌ను ఏర్పాటు చేసి జీతాలు ఇస్తే వారి ఇబ్బందులు తొలగుతాయి.ఉద్యోగులకు సక్రమంగా ప్రమోషన్లు రావాలంటే జీవో 888లోని రూల్ 33 ను తొలగించాలి. అప్పుడే సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు దక్కుతాయి.
మాతృ సంస్థతో సంబంధం లేకుండా 2010 పీఆర్సీనీ, ఇతర బెనిఫిట్స్‌ను అమలు చేయాలి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, అర్చ క, ఇతర సిబ్బందికి సంక్షేమ నిధి నుంచి ఇచ్చే గ్రాట్యుటీ రూ.2 లక్షలకు జీతం సీలింగ్‌గా పెట్టిన రూ.12,500 తొలగించి, గ్రాట్యుటీ రూ.5 లక్షలకు పెంచాలి. సిబ్బందికి 65ఎ ఫండ్ ద్వారా జీతాల ఇచ్చేలా సవరణ చేయించాలి.