P Manikyala Rao
-
భగ్గుమన్న మిత్రభేదం
టీడీపీ, బీజేపీ మధ్య తారస్థాయికి విభేదాలు మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా శంకుస్థాపనలు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి వైఖరిపై సీఎంకు ఫిర్యాదు దిగివచ్చిన టీడీపీ అధిష్టానం ముళ్లపూడి దూకుడుకు కళ్లెం వేస్తామని హామీ ఏలూరు : మిత్రపక్షాలు వైరివర్గాలుగా మారాయి. ‘కలిసి మెలిసి విరోధం’ అన్నచందంగా కత్తులు దూస్తున్నాయి. తాజాగా తాడేపల్లిగూడెం కేంద్రంగా టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు బుధవారం మరోసారి భగ్గుమన్నాయి. ఈ నియోజకవర్గంలో మిత్రపక్షాల మధ్య చెలిమి దాదాపు కంచికి చేరింది. నియోజకవర్గంలో తన ముద్ర ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, తమ పట్టు కోల్పోకూడదని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఎవరికి వారే పంతాలకు పోతుండటంతో ఇరువురి మధ్యా రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది. మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా ముళ్లపూడి బాపిరాజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం సన్నద్ధం కావడం వివాదానికి దారితీసింది. దీనిపై మంత్రి మాణిక్యాలరావు సీరియస్ అయ్యారు. ప్రారంభోత్సవాలను నిలుపుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అవసరమైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని అల్టిమేటం ఇచ్చారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పొత్తు ‘పొడిచింది’ పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం స్థానాన్ని టీడీపీ వదులుకుంది. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో పైడికొం డల మాణిక్యాలరావు పోటీచేసి విజయం సాధించారు. తదనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఇదే సీటును ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి, తప్పని పరిస్థితుల్లో రేసు నుంచి తప్పుకున్న ముళ్లపూడి బాపిరాజుకు మంత్రితో విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముళ్లపూడిని బుజ్జగించి ఆయనకు జెడ్పీ చైర్మన్ గిరీ కట్టబెట్టారు. పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఈలి నాని టికెట్ ఆశించి టీడీపీలో చేరారు. ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. ఎన్నికల నాటి విషయాలు ఇలా ఉంటే.. నియోజకవర్గంలో తనదైన మార్కు కోసం మాణిక్యాలరావు ప్రయత్నించడం, తమను కలుపుకుని వెళ్లడం లేదంటూ టీడీపీ నేతలు కయ్యానికి కాలు దువ్వడంతో విభేదాలు ముదిరాయి. గతంలో రాష్ర్ట ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సమక్షంలో జెడ్పీ చైర్మన్, మంత్రి ఒకరినొకరు విమర్శించుకున్న సంగతి తెలిసిందే. మంత్రి శిద్ధా రాఘవరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు సర్పంచ్ ఇంటికి మాణిక్యాలరావుతో కలసి వెళ్లారు. అదే సమయానికి అక్కడకు వచ్చిన జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఆవేశంగా.. మీరు ఇటీవలే బీజేపీలో చేరిన సర్పంచ్ భర్త వీర్ల గోవిందు వద్దకు వెళ్తే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిం టాయని మంత్రి శిద్ధాను ఉద్దేశించి అన్నారు. ఇందుకు మంత్రి మాణిక్యాల రావు అభ్యంతరం చెప్పగా, బాపిరాజు ఆవేశంగా.. ‘చాన్నాళ్లు ఓపికపట్టాం. మీ తీరు భరించలేకే ఇలా మాట్లాడుతున్నాం’ అంటూ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదమంటూ బాపిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిది, నాదీ ఒకేస్థాయి. ఆయనకు నీలం బుగ్గ కారు ఉంది. నాకూ ఉంది. అభివృద్ధి కోసం బీజేపీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మాకు జిల్లాలో ఏ మూలకు వెళ్లినా బోల్డంత పార్టీ కేడర్ ఉంది’ అంటూ గతంలో బాపిరాజు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో 15వ వార్డు కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పీతల సుజాత సమక్షంలోనూ మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి హోదాలో మాణిక్యాలరావు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళుతుంటే టీడీపీ నుంచి సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా హాజరు కావడం లేదు. దీంతో తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘ఇక్కడ ప్రైవేటు సామ్రాజ్యం నడుస్తోంది. కేబినెట్ క్యాడర్ కలిగిన మంత్రి వస్తే సర్పంచ్ కూడా రావడం లేదు’ అని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేసేం తగా విబేధాలు పెరిగిపోయాయి. తాజాగా పెంటపాడు మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రికి ఆహ్వానం లేకపోవడం వివాదాస్పదమైంది. విషయం తెలుసుకున్న మాణిక్యాలరావు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావుతోపాటు ఉన్నతాధికారులకు ఫోన్లుచేసి బాపిరాజు తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు వెంటనే శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదా వేయాలంటూ ముళ్లపూడికి సూచించారు. చంద్రబాబునాయుడు మంత్రితో మాట్లాడుతూ తొందరపడవద్దని, అన్ని విషయాలు మాట్లాడుకుందామని నచ్చచెప్పారు. విజయవాడలో జరిగే కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రానుండటంతో ఆయన వద్దే ఈ పంచాయితీ తేల్చేందుకు మంత్రి మాణిక్యాలరావు సన్నద్ధం అవుతున్నారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ ఇద్దరి మధ్యా విభేదాలు లేవని, ఆయన ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే తాను జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరిం చారు. ఇరువురి మధ్య పంచాయితీ సీఎం చెంతకు చేరడంతో దీనికి ముగింపు ఏ విధంగా పలుకుతారనే అంశంపై రాజ కీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తిస్తాం'
కడప : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు చెందిన 20 వేల ఎకరాల ఆలయ భూములు కబ్జాకు గురైనవని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు తెలిపారు. సదరు భూములును కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దూటూరు శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాణిక్యాలరావు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తించి... అక్కడివారికి శిక్షణ ఇచ్చి పూజారిగా నియమిస్తామని పి.మాణిక్యాలరావు వెల్లడించారు. -
పోలవరంపై బీజేపీలో అసంతృప్తి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై భారతీయ జనతా పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సైతం తీసుకెళ్లారు అని వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం ఇబ్బందే కాదని, ఇక్కడ పనులు చేపట్టడమే సమస్య అని తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టు పనులకు అంచనాలు తయారు చేసి, పనులకు సంబంధించిన బిల్లును కేంద్రానికి అందజేస్తే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో స్పష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరును మార్చడం సరికాదని.. అభిప్రాయపడ్డారు. పుష్కరాల అవినీతిపై విచారణ జరుగుతోంది గోదావరి పుష్కర పనుల అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలకు స్నాన ఘట్టాల గుర్తింపు, దేవాదాయ శాఖ తరుఫున చేట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. -
కప్పట్రాల్లలో దేవాదాయ మంత్రి పర్యటన
దేవరకొండ (కర్నూలు) : పూరాతన దేవాలయాలకు సంబంధించిన భూముల వివరాలను సేకరించి ఇంటర్నెట్లో ఉంచుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆయన మంగళవారం కర్నూలు జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కప్పట్రాల్ల అటవీ ప్రాంతంలో వెలసిన కౌలుట్ల చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఆలూరు ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ఉన్నారు. -
విన్నపాలు వినవలె..
భీమవరం కల్చరల్ :జిల్లాలోని ఆలయాలను భక్తి భావం ఉట్టి పడేలా తీర్చిదిద్దాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పైడికొండల మాణిక్యాలరావుకు భక్తులు చేసుకుంటున్న విన్నపాలు ఇవి.జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. వాటికి సంబంధించి కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి.పురాతన ఆలయాలు, జీర్ణావస్థకు చేరిన ఆలయాల మరమ్మతులకు జిల్లాకు రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం అంచనాల దశలోనే అవి ఉన్నాయి. పనులు వేగవంతం చేయాల్సిన అవసరముంది.జిల్లాలో ప్రధానమైన ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. భక్తులు వేచియుండేందుకు అదనంగా గదుల నిర్మాణం, సత్రాల నిర్మాణాలను చేపట్టాలి. ప్రముఖమైన పలు ఆలయాలకు స్థలాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అక్కడ అన్నసమారాధనలు చేసేందుకు, విశ్రాంతికి గదులు, వివాహాలకు కావలసిన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఆలయాలను గుర్తించి ప్రభుత్వ స్థలాలను వాటికి కేటాయించేలా చూడాలి.కొన్ని ఆలయాలకు వాస్తు దోషాలు ఉన్నట్టు గుర్తించారు. దేవాదాయ శాఖ స్తపతులతో వాస్తు మార్పులను చేపట్టాలి. స్తపతులతో సంప్రదించకుండానే చాలా ఆలయాల్లో వాస్తు మార్పులు చేస్తున్నారు. వాటిని గుర్తించి సరిచేయాలి.ఆలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆ ఖాళీలను భర్తీ చేయాలి.ఉద్యోగుల సమస్యలుదేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 60 ఏళ్లు వర్తించేయాలి. టెంపుల్ ఉద్యోగులకు సంబంధించి సం బంధిత ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని వారి జీతాలకు కేటాయిస్తున్నారు. అలా కాకుండా జిల్లాలో అన్ని దేవాలయాలకు ఒక కామన్ ఫండ్‌ను ఏర్పాటు చేసి జీతాలు ఇస్తే వారి ఇబ్బందులు తొలగుతాయి.ఉద్యోగులకు సక్రమంగా ప్రమోషన్లు రావాలంటే జీవో 888లోని రూల్ 33 ను తొలగించాలి. అప్పుడే సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు దక్కుతాయి. మాతృ సంస్థతో సంబంధం లేకుండా 2010 పీఆర్సీనీ, ఇతర బెనిఫిట్స్‌ను అమలు చేయాలి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, అర్చ క, ఇతర సిబ్బందికి సంక్షేమ నిధి నుంచి ఇచ్చే గ్రాట్యుటీ రూ.2 లక్షలకు జీతం సీలింగ్‌గా పెట్టిన రూ.12,500 తొలగించి, గ్రాట్యుటీ రూ.5 లక్షలకు పెంచాలి. సిబ్బందికి 65ఎ ఫండ్ ద్వారా జీతాల ఇచ్చేలా సవరణ చేయించాలి.