'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తిస్తాం' | Twenty thousand acres of temple land grabbing in andhra pradesh, says p manikyala rao | Sakshi
Sakshi News home page

'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తిస్తాం'

Published Fri, Dec 4 2015 11:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

Twenty thousand acres of temple land grabbing in andhra pradesh, says p manikyala rao

కడప : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు చెందిన 20 వేల ఎకరాల ఆలయ భూములు కబ్జాకు గురైనవని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు తెలిపారు. సదరు భూములును కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దూటూరు శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాణిక్యాలరావు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తించి... అక్కడివారికి శిక్షణ ఇచ్చి పూజారిగా నియమిస్తామని పి.మాణిక్యాలరావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement