తిరుమలలో మంగళవారం శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో విమానం ప్రయాణించింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో తూర్పు దిశ నుంచి పశ్చిమ దిశవైపు ఆ విమానం వెళ్లింది. భద్రతా కారణాల వల్ల తిరుమల ఆలయంపై విమాన ప్రయాణాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. తరచూ విమానాలు ఆలయానికి అతి సమీపంలోనే ప్రయాణిస్తుండటంతో టీటీడీ భద్రతాధికారులతో పాటు భక్తుల్లో ఆందోళన నెలకొంది.
శ్రీవారి ఆలయ సమీపం నుంచి వెళ్లిన విమానం
Published Tue, Mar 1 2016 8:21 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement
Advertisement